ఆవుని గోమాతగా , కామధేనువుగా పూజిస్తాం. భగవంతుడు మన కోసం సృష్టించిన మహిమాన్విత జీవి ఆవు ( గోమాత ). పవిత్ర గోమాత నుండి లభించే పాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం ( పంచ గవ్వాలు ) మానవజాతి అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి.


ఆవు పాలు అమృతం.

దేశవాళి ఆవు ఎప్పుడూ తిరుగుతూ వుంటుంది. నాటు ఆవుకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న  వెన్న పూసలో సూర్య శక్తిని గ్రహించగల దివ్వమైన ప్రాణ శక్తితో కూడిన " స్వర్ణనాడి " ( సూర్యకేతునాడి ) అనే సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రం ఉన్నది. సూర్యకిరణములు ఆవు మూపురముపై పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్య శక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని ' కేసీన్ ' అనే ఎంజైమ్ ను తయారుచేసి దానిని ఆవు పాలలో పెడుతుంది. అందువలన ఆవు పాలు , నెయ్యి , వెన్న పసుపు పచ్చని పసిమి రంగులో ఉంటాయి. 


భారత దేశంలో పాలు కేవలం ఒక పానీయం కాదు. పాలు అమృత తుల్యమని భావిస్తారు. రోజుకు ఒక గ్లాసు నాటు త్రాగడం వలప శక్తి వంతమైన , పవిత్రమైన సంపూర్ణ ఆరోగ్య ప్రదాయినే కాక , స్వాత్వికమైన శ్రేయస్కరమైన జీవన్నాన్ని అందిస్తుంది. పిల్లలు , యువకులు , స్త్రీలు , వృద్ధులు అన్ని వయస్సుల వారికీ నాటు ఆవు పాలు ప్రాధమిక పోషణను అందిస్తుంది. దాదాపు 63 శాతం ప్రోటీన్లు ( మాంసకృత్తులు ) మనకు పాల ఉత్పత్తుల ద్వారానే లభిస్తుంది. శాకాహారులకు మాంసకృతుల కోసం మరో ప్రత్యామాయం లేదు. ఆవు పాలు అభిషేకానికి , ప్రసాదాలకు పూజలకు శ్రేష్ఠమైనది. 
      ఆవు పాలు మాత్రమే ఎంత వేడి చేసిన దానిలో ఉన్న ఏ గుణం నశించదు. 


 ఆవు పాలు తప్ప ఇతరములైన పాలు వేడి చెయ్యటంతోటే వాటిలో ఉన్న తత్వాలు నశించి పోతాయి. దేశీయ ఆవు యొక్క ఆవు పాలు , పెరుగు , మజ్జిగ , వెన్న మరియి నెయ్యి అన్నియు మానవునికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. 

                                                                                                                 " హరే కృష్ణ " 


మరింత సమాచారం తెలుసుకోండి: