పూర్వకాలంలో కులవ్యవస్థ అంటరానితనం ఉన్నాయని చాలా మంది అభిప్రాయం కాని అది నిజమే కాదు.మధ్యలో వచ్చిన ఈ భేషజం కొందరు స్వార్ధ పరుల పిడివాదం మాత్రమే.నిజానికి వర్ణ వ్యవస్థ వారి వారి ప్రవర్తనా సరళి,వారు చేసే వ్యవహారాలను బట్టే ఏర్పడింది.మనం వైష్ణవాలయాలని వెళ్ళినప్పుడు అక్కడ కొందరు శూద్ర కులంలొ పుట్టిన కొందరు మహనీయులకు కూడా సాష్టాంగ దణ్ణం పెడతాం. నిజానికి వారుండే స్థలం ఎక్కడో తెలుసా? సాక్షాత్తు గర్భగుడిలోనే!!! వాళ్ళే ద్రవిడభాషను రక్షించి అజ్ఞానాంధ కారంలో కొట్టుమిట్టాడే జీవులకు మోక్షమార్గం ఉపదేశించడానికి జన్మించిన 12 మంది ఆళ్వారులు. వారిలో


తిరుమళిశై యాళ్వార్ (తిరుమలసాయి ఆళ్వార్):
క్రీ.శ. 720 ప్రాంతానికి చెందినవాడు. పుట్టుక రీత్యా పంచముడు. వైష్ణవం, బౌద్ధం, జైనం సిద్ధాంతాలలో పండితుడు. పెరుమాళ్ళను తన మిత్రునిగా తలచి మంగళాశాసనాలు పాడాడని చెబుతారు. ఈ ఆళ్వారు, అతని శిష్యుడు కాంచీపురం వదలి వెళ్ళిపోదలిస్తే ఆవూరి గుడిలోని పెరుమాళ్ళు తన చాపను (ఆదిశేషుని) చుట్టగా చుట్టుకొని వారివెంట బయలుదేరాడట. ఈ ఆళ్వారు చెప్పినట్లు చేయడం వలన ఆ దేవునికి 'యధోక్తకారి' అన్న పేరు వచ్చింది.


తిరుమంగయాళ్వార్ (తిరుమంగై ఆళ్వారు):
క్రీ.శ. 776 కాలంనాటివాడు. పుట్టుక రీత్యా శూద్రుడు. పూర్వాశ్రమంలో శృంగార పురుషుడు. దోపిడీ దారుడు. తరువాత భక్తుడై పెరుమాళ్ళను స్తుతించాడు.
తిరుప్పాణాళ్వార్ (తిరుప్పాన్ ఆళ్వారు):
క్రీ.శ. 701 ప్రాంతం వాడు. ఉరయూర్‌లో పానార్ ("అంటరాని జాతి" అనబడేది) కుటుంబంలో పెరిగాడు. తన అందమైన పాశురాలతో పెరుమాళ్ళను అర్చించాడు. పది పాశురాలు మాత్రం గల కావ్యం వ్రాసి ఉత్తమకవిగా వాసికెక్కినాడు.
నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని
క్రీ.శ. 798 కాలంలోని వాడంటారు. పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉన్నది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరం, నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది ఈ 'శఠకోపముని' పేరుమీద మొదలయిన ఆచారమే. తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.


మిగిలిన వారిలొ బ్రాహ్మణ,క్షత్రియ జాతి వారు కూడా ఉన్నారు.వీరందరినీ కలిపే పూజిస్తాం కాని కులాలతో కాదుకదా! అలాగే వీళ్ళు కూడా జాతి భేదం చూపినట్టు ఎక్కడా ఢంకా పథం గా లేదు.ఇక నాయనార్లలో చాలామంది శూద్ర జాతివారే,ఈనాటికీ కొన్ని శైవ దేవాలయాల్లో జంఘాల వాళ్ళే పూజారులు....ఇంక ఎక్కడ ఉందని మూర్ఖంగా సనాతన హైందవ ధర్మాన్ని తిడుతూ ఎఫ్ బీ ల్లో తిడుతూ చేతికి వచ్చిన రాతలు రాస్తారు? ఇకనైనా మారండి.ఎవరో ఎక్కడో ఒకరిద్దరు చేసిన చచ్చుపనికి సనాతనాన్ని నిందించటం అత్యంత ఘోరమైన పాపం,అలాగే బ్రాహ్మ‌ణుల గొప్ప‌ద‌నాన్ని కించప‌ర‌చ‌డం కూడా మంచిది కాదు,అలాగ‌ని పుట్టుక‌తో బ్రాహ్మ‌ణులలో వైదిక‌ ధ‌ర్మాలు ఆచ‌రించ‌నివారు ఎలా బ్రాహ్మ‌ణులవుతారో అంత‌ర్యామి అయిన‌ ప‌ర‌మాత్మ‌కి చెప్పుకోగ‌ల‌రా....!అనేది వారి వారిలో ఉన్న ప‌ర‌మాత్మ‌కు తెలుసు.....స‌ర్వం శ్రీ ఉమామ‌హేశ్వ‌ర‌ ప‌ర‌బ్ర‌హ్మార్ప‌ణ‌మ‌స్తు


మరింత సమాచారం తెలుసుకోండి: