భారత దేశంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల్లో తులసి గొప్ప తనం గురించి ఎంతో వివరించారు.  అంతే కాదు పూర్వ కాలం నుంచి తులసి మంచి ఆయుర్వేదం అని కూడా మన పెద్దలు చెప్పారు. ‘‘యన్మూలే సర్వయతీర్థాని‘ యన్మధ్యే సర్వదేవతా: యదగ్రే సర్వవేదాశ్చ- తులసి యిత్వాల నమమ్యాహమ్!!’’ అని తులసిని నమస్కరించాలి. 


కార్తీకమాసములో వచ్చే సోమవారములకు ఒక ప్రత్యేకత ఉన్నది. స్త్రీ,పురుషులు వయేబేధము లేకుండా ఈ మాసములో ఉదయాన్నే బ్రహ్మ ము మూహుర్తములో నది, పుష్కరిణి, సముద్రములందు పవిత్రస్నానములు ఆచరించి ఆ పరమేశ్వరుని జలము, పత్రము, పుష్పములతో అభిషేకము చేస్తూ, ముక్తి, మోక్షములను పొందుట భక్తు ఆరాధనాక్రమము. కార్తీక  మాసమున పౌర్ణమి సోమవారము కాని, శ్రవణా నక్షత్రముతో కూడిన సోమవారము కాని కలిసి వచ్చిన రోజును కోటి సోమవారము అందురు.


ఆ రోజు నియమ, నిష్ఠలతో ప్రాత:కాలముననే ధనికులు, పేదవారు, బాలలు, వృద్దులు, స్త్రీ, పురుషులనెడి బేధము లేకుండా నదీ స్నానమాచరించి, నుదుట విభూధిని ధరించి పరమేశ్వరునికి ప్రీతికరమైన బిల్వదళములతో అర్పించిన, అభిషేకించిన కోటి జన్మల దరిద్రములు తొలగి సుఖశాంతములతో, సిరిసంపదలతో వర్థిల్లుతారు. మాఘమాసం కాల మాహాత్యాన్ని గురించిన మన పూర్వీకులకు స్పష్టంగా తెలుసు కాబట్టి, వారు కాలానికి అంతటి ప్రాముఖ్యత నిచ్ఛారు. మన పురాణాలలో ఒక్కొక్క నెల యొక్క మహాత్మ్యం వివరించబడింది.


అందులో కార్తీక, మాఘ మాసాల మహిమ ప్రముఖంగా వివరింపబడింది. అందులో కార్తీక, మాఘ మాసాల మహిమ ప్రముఖంగా వివరించబడింది. కార్తీకమాసంలో దీపానికి ప్రాముఖ్యతనిస్తే, మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యమివ్వబడింది. మాఘమాసంలో సూర్యోదయానికి ముందే భగవాన్నమస్మరణతో స్నానం చేయడం సర్వపాపహరం, పుణ్యప్రదం. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే ఆదివారాలు అత్యంత మహిమాన్వితమైనవి. ఆరోజు క్షీరాన్నం వండి సూర్య భగవానునికి నివేదించి ‘ఆదిత్యహృదయం’ స్త్రోత్రంతో సూర్యుడిని ఆరాధించడం అరిష్టాలను, అనారోగ్యాన్ని తిరిమికొడుతుంది.


మాఘపూర్ణిమ స్నానం సంత్సరంలో వుండే పూర్ణిమలలో మాఘ, వైశాఖ, కార్తీక మాసాల్లో వచ్చే పూర్ణిమలు ఉత్తమమైనవి. స్నానదాన, జపాది సత్కర్మలు లేకుండా ఆ మూడు పూర్ణిమలను వృధాగా గడపరాదంటారు. మహిమాన్వితమై మాఘపూర్ణిమనే ‘మహామాఘి’ అని కూడా వ్యవహరిస్తారు. ఈరోజున సముద్రస్నానం చేయడం మహాపవిత్రం, ఫలప్రద, ఆ విశేష్ఠ తిథినాడు చేసే ఇష్టదేవతల ఆరాధన, ధ్యాన, జపాది అనుష్ఠానాలు విశేష ఫలితాలనిస్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి: