నవగ్రహములు తొమ్మిది , ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. కుంభ‌కోణం: తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.
Image result for suriyanar koil temple timings
1) సూర్యనార్ కోయిల్ - తిరుమంగళంకుడి.
తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ పిలువబడే సూర్యదేవలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమనులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .


ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది .
ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్ష్మీని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచ్చు.
ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.


ఈ ఆలయ పూజలు చాల నిష్ఠగా జరుగుతాయి, పూజంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది, మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది.  ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి సంపద ప్రదాత కూడా. 1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: