నవగ్రహములు తొమ్మిది , ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. కుంభ‌కోణం: తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.

Image result for రాహు గ్రహ దేవాలయము - తిరునగేశ్వరాము

కుంభకోణానికి 5 k.m దూరములో వుంది. ఇక్కడ రాహు గ్రహామునకు గల దేవాలయము ఇది ఒక్కటే. ఇక్కడ నిత్యము వచ్చే రాహు కాల సమయములో పాలాభిషేకము చేస్తారు. ఆ పాలాభిషేకము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము (మెడ) దగ్గరకు వచ్చేసరికి పాలు అన్ని నీలము రంగులోకి మారతాయి. మిగిలిన సమయాలలో ఇలా జరగదు.

 Related image

ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు ‘’గిరి గుజాంబికా దేవి’’. ఇక్కడ ఆదిశేషుడు, దక్షుడు, కారకోటుడు రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చించారు. ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: