భారతీయ సంస్కృతిలో భాగాలు తీర్థక్షేత్రాలు. పురాణాలు ఎన్నో తీర్థవిశేషాల గురించి మనకు తెలియజేస్తున్నాయి. దక్షిణభారతదేశానికి మకుటాయమానం తిరుమల క్షేత్రం. ఇక్కడ శ్రీవేంకటాద్రి విధుడగు శ్రీనివాసుని పాదపద్మాలను సేవిస్తూ తీర్థరాజాలు ప్రకాశిస్తున్నాయి. అత్యంత పావనము సర్వకామదాయకాలైన అరవై ఆరు కోట్ల తీర్థాలు తిరుమలక్షేత్రంలో ఉన్నాయని బ్రహ్మపురాణం మనకు తెలియజేస్తోంది.
 Image result for స్వామిపుష్కరిణి – ప్రాశస్త్యం
తిరుమలలో తీర్థాలు నాలుగు విధాలుగా మనకు దర్శనమిస్తున్నాయి. 1.ధర్మరతి తీర్థాలు 2.జ్ఞానప్రదాలు 3.భక్తివైరాగ్యప్రదాలు 4.ముక్తిప్రదాలు. ధర్మరతి తీర్థాలు : ఇవి 1008 తీర్థాలు. ఈ తీర్థాల్లోని నీటిని తాగినా, వాటిసమీపంలో నివసించినా, సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదిస్తాయి.
 Image result for స్వామిపుష్కరిణి – ప్రాశస్త్యం
జ్ఞానప్రదాలు : ఇవి భక్తియోగసాధన ద్వారా తరింపబడే తీర్థరాజములు. ఇవి 108తీర్ధాలు.
 
భక్తివైరాగ్యప్రదాలు : ఈ తీర్థస్నానం పరమేశ్వరునిపై భక్తి, సంసారంపై విరక్తిని కలిగిస్తుంది. ఇవి 68తీర్థాలు.
 
ముక్తిప్రదాలు : పూర్వోక్తాలైన పుణ్య తీర్థములకన్నా సప్తతీర్థాలు (7) ముక్తి సాధనానికి శ్రేష్ఠమైనవి.
 
తిరుమలలో ముఖ్యతీర్థాలు:
 
                అసంఖ్యాకమైన పవిత్రతీర్థాలు ప్రవహించే తిరుమలలో కొన్ని తీర్థాలు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మిగిలిన తీర్థములను దర్శించుట కొంచెం కష్టతరము. శ్రీనివాసుని దర్శించిన భక్తుడు సమీపంలో గల కింది తీర్థాల్ని దర్శించి తరించవచ్చు.
1.శ్రీస్వామిపుష్కరిణి, 2.కుమారధార 3.తుంబుర తీర్థం 4.రామకృష్ణ తీర్థం 5.ఆకాశగంగ 6.పాపవినాశన తీర్థం 7.పాండవతీర్థం.
 
సప్తగిరులలో అనేక పుణ్యతీర్థాలున్నట్టు, పురాణాల్లో వాటి ప్రాశస్త్యాన్ని వర్ణించినట్లు తెలుపబడింది.  వాటిలో ముఖ్యమైనవి-
 Image result for తిరుమలలో ముఖ్యతీర్థాలు
                1) స్వామిపుష్కరిణి, 2) కపిలతీర్థం మొదలగు పదిహేడు (17) తీర్థాలు. 3) కుమారధారాతీర్థం, 4) పాండవతీర్థం, 5) జరాహరాది తీర్థ త్రయం, 6) ఫల్గుణీ తీర్థం, 7) జాబాలీ తీర్థం, 8) సనకసనందన తీర్థం 9) కాయ, రసాయన తీర్థాలు, 10) పాపనాశనం, 11) దేవతీర్థం, 12) పద్మసరోవర తీర్థం, 13) అస్థిసరోవరతీర్థం, 14) ఆకాశగంగ తీర్థం, 15) చక్రతీర్థం, 16) కటాహతీర్థం, 17) తుంబురతీర్థం  18) మన్వాద్యష్టోత్తర శతతీర్థం, 19) రామకృష్ణతీర్థం
 
స్వామిపుష్కరిణి :
 
                స్వామిపుష్కరిణి అనే తీర్థం వేంకటాచలంపై ఉంది. ఇది వైకుంఠం నుంచి గరుడునిచే తీసుకురాబడిన క్రీడాపర్వతంలో శ్రీభూదేవులకు క్రీడా సరస్సుగా ఉన్నట్టు చెప్పబడింది. దీని ప్రస్తావన వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలలో కన్పిస్తుంది. వేంకటా చలంలో ఉన్న తీర్థాలకు ఈ పుష్కరిణి అవతార స్థానంగా పేర్కొనబడింది. స్వామివారి ఆలయానికి ఉత్తరదిశలో దర్శనం ఇస్తున్నది ఈ పుష్కరిణియే.
 Image result for స్వామిపుష్కరిణి
                ఈశాన్యం: గాలవతీర్థం; తూర్పు: మార్కండేయ తీర్థం; ఆగ్నేయం: ఆగ్నేయతీర్థం; ఉత్తరం: ధనదతీర్థం, సరస్వతీతీర్థం; దక్షిణం: యామ్య తీర్థం; వాయవ్యం: వాయుతీర్థం; పశ్చిమం: వారుణతీర్థం; నైరుతి: వసిష్ఠతీర్థం. మొదలగు అమోఘమైన తీర్థరాజాలతో స్వామిపుష్కరిణి విలసిల్లుతోంది.
 
                శ్రీమన్నారాయణుని పాదపద్మాలనుండి ప్రవహిస్తున్న స్వామి పుష్కరిణీ ప్రభావం వర్ణనాతీతం. దీన్నే విరజానది అని కూడా అంటారు. ఇది గంగాది సర్వతీర్థాలకు జన్మస్థానం. దీని దర్శనం, స్పర్శనం, స్మరణం కూడా సర్వాభీష్టాలను అనుగ్రహిస్తుంది. ప్రాతఃకాలంలో స్వామి పుష్కరిణిని స్మరించిన వారికి ఉత్తమ లోకాలు సంప్రాప్తిస్తాయి. మార్గశిర శుద్ధద్వాదశినాడు ఆరుణోదయ వేళలో మూడున్నరకోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయి. ఇందులో చేరటం వల్ల ఈ తీర్థాల పాపాలన్నీ నశించిపోతాయని వరాహ, వామన పురాణాలు తెలియజేస్తున్నాయి.
 
వరాహతీర్థం :
 
                శ్రీనివాసుని సన్నిధానముననుసరించి ఉన్న స్వామిపుష్కరిణీ తీర్థానికి వాయువ్యభాగంలో ఉత్కృష్టమైన వరాహతీర్థముంది. ఈ తీర్థవిశేషాలు దిలీపునకు దుర్వాసమహాముని బ్రహ్మపురాణాలలో విశదీకరించారు.
 
స్నానమహిమ :
 Image result for తిరుమలలో ముఖ్యతీర్థాలు
                స్వామిపుష్కరిణిలో స్నానం సర్వాభీష్ట ఫలప్రదం. ఎవరు ఏ కోరికతో ఇందులో స్నానం చేస్తేవారికి ఆ కోరిక త్వరలో సిద్ధిస్తుంది. పుష్కరిణి స్నానం సర్వపాపనిర్మూలకమని తారకవధ చేసిన కార్తికేయుడి వృత్తాంతం వల్ల తెలుస్తుంది.
 
                బ్రహ్మ, స్కాంద, భవిష్యోత్తరపురాణాలు స్వామి పుష్కరిణిలో స్నానం చేయాల్సిన సమయాన్ని నిర్ణయించాయి. ధనుర్మాసంలో శుద్ధద్వాదశినాడు సూర్యోదయానికి ముందుగా తీర్థాలన్నీ స్వామిపుష్కరిణిలో వచ్చి చేరుతాయి. ఆ సమయంలో పుష్కరిణిస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో ఉంది.
 
                స్వామిపుష్కరిణిలో స్నానం చేసిన వారి వారి అభీష్టాలను పొందిన భక్తులను గురించి వరాహ, భవిష్యోత్తర, స్కాందపురాణాలు వివరిస్తున్నాయి. భవిష్యోత్తరపురాణంలో స్నానమహిమలు వర్ణింపబడ్డాయి.
 Related image
భవిష్యోత్తర పురాణం : స్వామిపుష్కరిణి మాహాత్మ్యాన్ని తెలియజేస్తూ శంఖణ స్వప్న వృత్తాంతాన్ని పేర్కొంటున్నది.
 
నారాయణ వృత్తాంతం : అంగిరస పుత్రుడు నారాయణుడు స్వామి పుష్కరిణి స్నానమహిమ చేత పరమపదాన్ని పొందినట్లు భవిష్యోత్తరపురాణం వల్ల తెలుస్తున్నది.
 
శ్రీరామవృత్తాంతం : శ్రీరాముడు వానరసైన్యంతో వేంకటాద్రికి వెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి దాని ప్రభావం చేతనే రావణాది రాక్షసుల్ని జయించి సీతాదేవిని తిరిగి పొందినట్లు భవిష్యోత్తరపురాణం తెలియజేస్తోంది.
 
స్కాందపురాణం : స్కాందపురాణం, స్వామి పుష్కరిణి ప్రభావాన్ని నిరూపించడానికి ఎన్నో వృత్తాంతాల్ని తెలియజేస్తున్నది. మానవుడు మూడుసార్లు స్వామి పుష్కరిణిని స్మరిస్తూ ఏ తీర్థంలో స్నానం ఆచరించినా బహు పుణ్యప్రదమని ఈ పురాణం వివరిస్తున్నది.
 Image result for శ్రీ వేంకటాచలం
                పరమపవిత్రమైన శ్రీ వేంకటాచలంలో ఎన్నో పవిత్రములైన తీర్థ రాజాలున్నాయి. అన్నింటిలోనూ అత్యంత పావనమైనది స్వామిపుష్కరిణి. విష్ణు పాదోద్భవమై, బ్రహ్మకరస్పర్శతో పవిత్రమై సనకసనందనాది యోగులచే కొనియాడబడినది ఈ పుష్కరిణి.


మరింత సమాచారం తెలుసుకోండి: