ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి , అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి , దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి . పీట మరీ ఎత్తుగా గాని , మరీ పల్లముగా గాని ఉండకూడదు . పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి , కుంకుమ తో బొట్టు పెట్టి , వరి పిండి , (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి.

Image result for sri krishna ashtami pooja

సాధారణం గా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి . ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి . ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి ,పిదప ఒక పళ్ళెంలో గాని ,క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి , అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
Image result for sri krishna ashtami pooja
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము :
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని , ఇత్తడిది గాని , మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి , వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను.
Image result for sri krishna ashtami pooja
 తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను . కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను . దీపారాధనకు నువ్వులనూనె గాని ,కొబ్బరి నూనె గాని, ఆవు నెయ్యి గాని వాడ వచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు . పూజకు విడిగా ఒక గ్లాసు గాని , చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.
Image result for sri krishna ashtami pooja
శ్రీ కృష్ణుని వ్రత పూజకు కావలసిన ముఖ్య వస్తువులు :
కృష్ణుని బొమ్మ (శక్తి కొలది బంగారం , వెండి లేదా మట్టి బొమ్మ ) లేదా చిత్ర పటము , పువ్వులు, కొబ్బరికాయలు , పళ్ళు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గిపెట్టె , అగరు వత్తులు , వస్త్ర , యజ్ఞోపవీతములు , నివేదనకు అటుకులు ,బెల్లం ,వెన్న , ప్రత్యేకముగా చేసిన పిండి వంటలు ( కృష్ణునికి ఇష్టమైన పదార్దములు జంతికలు , బియ్యం పిండితో చేసిన పాలకాయలు మొ|| వి ) సిద్దము చేసుకొనవలెను పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి ఈ నామములు మొత్తం 24 కలవు. 
1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి 
.10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం   చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను .

Image result for sri krishna ashtami pooja

సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అధ్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలము నకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను.) ,కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను.) శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పు కొనవలెను .అనియు చెప్పు కొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .... సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకొనవలెను ),... ఆయనే .(సంవత్సరమునకు రెండు ఆయనములు -ఉత్తరాయణము , దక్షిణాయనము జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )... ఋతు: (వసంత, గ్రీష్మ , వర్ష, మొ || ఋతువులలో పూజ సమయంలో జరుగుతున్న ఋతువు పేరు ).............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు )............పక్షే (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగు చున్న సమయమున గల పక్షము పేరు ) తిదౌ ,(ఆరోజు తిది ) వాసరే (ఆరోజు ఏ వారమన్నది చెప్పుఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .

Image result for sri krishna ashtami pooja

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి బారకాః
యేతే షామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||


ప్రాణాయామమ్య : ఓం భూ : - ఓం భువః ఓం సువః - ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓం సత్యం - ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధియోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను .
సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ కృష్ణ పరమాత్మ దేవతా ముద్దిశ్య కృష్ణ పరమాత్మ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్భిరుపచారై : సంభావతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ,తదంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలాశా రాదనను చేయవలెను.

Image result for sri krishna ashtami pooja

కలశ పూజను గూర్చిన వివరణ : వెండి,
 రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును 
తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ 
పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు 
చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని 
పూయరాదు. గంధమును ఉంగరపు  వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, 
మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, 
దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .
మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
      మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
      ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
      అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః

Image result for sri krishna ashtami pooja

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి, సరస్వతి, నర్మదా సింధు
   కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ||
ఇక్కడ  ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను ) పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి )  ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని(ఆ  నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి .

Image result for sri krishna ashtami pooja

మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
                 యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి : ||
అని  పిదప కాసిని అక్షతలు ,పసుపు ,గణపతి పై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాధిపతయే నమః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తూ తదాస్తు .తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .


శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
   ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||
   సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
   లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
   ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
   వక్ర తుండ శ్శూర్ప కర్ణో హీరంభః స్కంద పూర్వజః
   షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి
   విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
   సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త స్యన జాయతే ||
అని
 ప్రార్దించి పిమ్మట కృష్ణునికి షోడశోపచార పూజను చేయవలెను.షోడశోపచారములనగా 
ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం , యజ్ఞోపవీతం , 
గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు 
మొదలగునవి.
అధ షోడశోపచార పూజాః
       ధ్యానం
శ్లో || శ్రీ కృష్ణ గోపీజన ముఖ్య విష్ణో బ్రహ్మాండ కుక్షింబర వాసుదేవ |
  గోపీ సహస్ర షోడశ వల్లభాఖ్య ,గోవింద పీతాంబర శంఖ చక్రిణ్ ||
  ఏవం ధ్యాత్వా హరిం సమ్యక్ శ్రీ కృష్ణః విశ్వ రూపణం
ఇష్ట కామ్యార్ధ సిద్ద్యర్ధం పూజాం కుర్యాధ్య దావిధి ||
ఓం శ్రీ కృష్ణాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి అని శ్రీ కృష్ణుని మనస్సున ధ్యానించి నమస్కారించవలెను
ఆవాహనం : శ్లో || ఆవాహయామి దేవేశ సిద్ద గంధర్వ సేవితః
                       యద్ర హాస్య మిదం పుణ్యం సర్వ పాప హారో హరి :||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః ఆవాహయామి .ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి .అనగా 
మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం .అట్లు మనస్సున స్మరిస్తూ 
అక్షతలు దేవునిపై వేయవలెను .
ఆసనం : శ్లో || దేవ దేవ జగన్నాధా ప్రణత క్లేశ వాశన,
                 రత్న సింహాసనం దివ్యం గృహాణ మధుసూదన ||
ఓం
 కృష్ణాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం 
సమర్పయామి. దేవుడు కూర్చుండటకై మంచి బంగారు పీత వేసినట్లు అనుకుంటూ అక్షతలు
 వేయవలెను.
అర్ఘ్యం : శ్లో || కురుష్వ మేద యాన్దేవ సంసారార్తి భయా పహ
               దధి క్షీర జలోపేతం గృహాణర్ఘ్యం నమోస్తుతే ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి . దేవుడు చేతులు కడుగుకొనుటకై
 నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ , ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో 
వదలవలయును .
పాద్యం : శ్లో || లాంచితం కురుమే దేవ దుష్క్రుతంచ వినాశాయ
                 పాద్యం గృహాణ భగవాన్ మాతురుత్సంగ సంస్థిత ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః పాదౌ : పాద్యం సమర్పయామి . దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు 
నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదేగిన్నేలో
 ఉద్దరిణెతో వదలవలెను .
ఆచమనీయం : శ్లో || శ్రీ వత్సాంక జగద్రూప శ్రీ ధర శ్రీ నికేతన
                           ఉపేంద్ర దేవకీ పుత్ర గృహాణాచమనీయకం ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై
 నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు 
నీరు వదలవలెను.
సూచన : అర్ఘ్యం ,పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరివేణం లో వదలరాదు.
మధుపర్కం : శ్లో || గోపవేష నమస్తుభ్యం దధి క్షీర సమన్వితం
                         మధుపర్కం గృహాణే దం మయాదత్తం హికేశవ ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః మధుపర్కం సమర్పయామి .స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర
 మిచ్చుచున్నామని తలుస్తూ ,ఈ మధుపర్కం ను (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ 
సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది 
ఉంచుకొనవలెను ) ఆయన ప్రతిమకు అద్దవలెను.
పంచామృత స్నానం : శ్లో || శర్వాయ స్వర్గ పతయే గోవిందాయ మహాత్మనే
                                      స్నానం పంచామృతం దేవ గృహాణ సరసత్తమ ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో 
కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి , ఆవుపాలు, ఆవు పెరుగు,తేనె, 
పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.
శుద్దోదక స్నానం : శ్లో || నారికేళోదకం గంగా యమునాది సముద్భవం
                                శుద్దోదకం గృహాణేశ స్నానం కురు యధావిధి ||
ఓం శ్రీ కృష్ణాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి . పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను. 
వస్త్ర యుగ్మం : శ్లో || శ్రీ ధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే ,
                           పీతాంబర ప్రదాస్యామి వాసుదేవాయ నమోస్తుతే ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును ( పైన 
చెప్పినట్లు ప్రత్తిని గుండ్రని బిళ్ళ ఆకారములో చేసి కుంకుమలో అద్దినచో అది
 వస్త్ర మగును ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను
యజ్ఞోపవీతం : శ్లో || బ్రహ్మ సూత్రం చోపవీతం త్రయీనాద ధరాధర ,
                          గోవింద పరమానంద వాసుదేవాయతే నమః ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను . ఇదియును 
ప్రత్తితో చేయవచ్చును . ప్రత్తిని తీసుకుని పసుపుచేత్తో బొటన వ్రేలు ,మధ్య 
వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి , కుంకుమ అద్దవలెను . దీనిని 
పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను .
సర్వాభరణాని : శ్లో || కేయూర వలయం చైవ గ్రైవేయం కుండల ద్వయం
                            అంగుళీయక రత్నా విభూష ణానితు గృహ్యాతాం ||
శ్రీ కృష్ణాయ నమః సర్వాభరణం సమర్పయామి .శక్తి కొలది ఆభరణములను స్వామీ వద్ద ఉంచి పూజించవలెను.
గంధం : శ్లో || చంద నాగరు కర్పూర కస్తూరీ ఘన సార సమన్వితం ,
                గంధం గృహాణ గోపాల నానా గందాం శ్చదారాయ ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః గంధాన్ సమర్పయామి .ముందుగా తీసి పెట్టుకున్న గంధమును 
కుడిచేతి ఉంగరం వ్రేలుతో 4 లేదా 5 చుక్కలు పడునట్లు స్వామివారి ప్రతిమపై 
చల్లవలెను.
అక్షతాన్ : శ్లో || గోవింద పరమానంద హరిద్రా సహితాక్షతాన్,
                    విశ్వేశ్వర విశాలాక్షా గృహాణ పరమేశ్వర.
ఓం
 శ్రీ కృష్ణాయ నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు అనగా కొద్ది బియ్యమును 
తడిపి పసుపు వేసి కలుపవలెను. ) అక్షతలు తీసుకుని స్వామివారి ప్రతిమపై 
చల్లవలెను.
పుష్ప పూజ : శ్లో || సామంతి కావ కుళ చంపక పాటలాజ్జ పున్నాగ జాజి కరవే కరనాల పుష్పై:
                             బిల్వ ప్రవాళ తులసీదళ మల్లి కానిత్వా పూజయామి జగదీశ్వర వాసుదేవ ||
ఓం శ్రీ కృష్ణాయ నమః పుష్పాణి సమర్పయామి స్వామివారికి పువ్వులతో అలంకరించి , పువ్వులతో పూజించ వలయును
పిదప
 శ్రీ కృష్ణునికి అధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామములను చదువుచూ 
ఒక్కొక్క నామమునకు స్వామిపై అక్షతలు లేదా పసుపు లేదా కుంకుమను వేస్తూ పూజ 
చేయవలెను.
                                                                                                                 అధాంగ పూజ
ఓం
 శ్రీ త్రివిక్రమాయ నమః పాదౌ పూజయామి ; ఓం శ్రీ గంగా ప్రభవాయ నమః గుల్ఫౌ 
పూజయామి ; ఓం శ్రీ విష్వక్సేనాయ నమః జంఘే పూజయామి; ఓం శ్రీ జనార్ధనాయ నమః 
జానునీ పూజయామి ; ఓం శ్రీ పీతాంబరాయ నమః ఊరూ పూజయామి ; ఓం శ్రీ గరుడవాహనాయ 
నమః కటిం పూజయామి ; ఓం త్రిలోక ప్రభవాయ నమః గుహ్యం పూజయామి ; ఓం శ్రీ 
పద్మనాభాయ నమః నాభిం పూజయామి ; ఓం శ్రీ దామోదరాయ నమః ఉదరం పూజయామి ; ఓం 
శ్రీ కౌస్తుభ దారిణే నమః హృదయం పూజయామి ; ఓం శ్రీ వనమాలినే నమః స్థనౌ 
పూజయామి ; ఓం శ్రీ కంబు గ్రీవాయ నమః కంటం పూజయామి ;ఓం శ్రీ దివ్యాయుదాయ నమః
 స్కందౌ పూజయామి ; ఓం శ్రీ శార్ జ్ఞ పాణియే నమః బాహూపూజయామి ; ఓం శ్రీ శంఖ 
చక్ర ధరాయ నమః హస్తౌ పూజయామి ; ఓం చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి ; ఓం శ్రీ 
దేవగర్భాయ నమః ఓష్ఠ పూజయామి ; ఓం శ్రీ ఉపేంద్రాయ నమః ఘ్రాణం పూజయామి ; ఓం 
పుండరీ కాక్షాయ నమః నేత్రౌ పూజయామి ; విష్టర శ్రవసే నమః కర్ణౌ పూజయామి ; 
మాధవాయ నమః లలాటం పూజయామి ; దేవకీ సూనవే నమః సర్వాంగాణి పూజయామి .
అనంతరం
 108 పేర్లు గల అష్టోత్తర శతనామావళి తో స్వామిని పూజించవలెను .ఈ క్రింది 
నామములను చదువుచూ ఒక్కొక్క నామమునకు స్వామిపై అక్షతలు లేదా పసుపు లేదా 
కుంకుమను వేస్తూ పూజ చేయవలెను.
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశ స్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురా క్రుతయే నమః
ఓం శుకనాగ మృతాబ్దీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగీనాం పతయే నమః 30
ఓం వత్సవాటి చరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలా కృతియే నమః
ఓం గోప గోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటి సూర్య సమప్రభాయ నమః 40
 శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి 
ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాదాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలా మానుష విగ్రహాయ నమః
ఓం శ్రీ వత్స కౌస్తుభ ధరాయ నమః
ఓం యశోదా వత్సలాయ నమః
ఓం హరియే నమః  10 
ఓం చతుర్బుజాత్త చక్రాసి గదా నమః
ఓం శంఖాంబు జాయుదాయుజాయ నమః
ఓం దేవకీ నందనాయ నమః
ఓం శ్రీ శాయ నమః
ఓం నంద గోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునా వేగ సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనా జీవిత హరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నంద వ్రజ జనా నందినే నమః 20
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశ స్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురా క్రుతయే నమః
ఓం శుకనాగ మృతాబ్దీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగీనాం పతయే నమః 30
ఓం వత్సవాటి చరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలా కృతియే నమః
ఓం గోప గోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటి సూర్య సమప్రభాయ నమః 40
ఓం ఇలాపతయే నమః
ఓం పరం జ్యోతిషే నమః
ఓం యాద వేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసినే నమః
ఓం పారిజాతా పహారకాయ నమః
ఓం గోవర్ధనా చలోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వ పాలకాయ నమః 50 
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ  నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషనాయ నమః                                        60
ఓం శమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ  కృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్ద విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమ
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః 70
ఓం నారాకాంతకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః 80
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకృతే  నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః 90
ఓం బర్హిబర్హావతంసకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధదియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత
శ్రీ పదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః 100
ఓం పన్నగాశన వాహనాయ నమః
ఓం జలక్రీడా సమాసక్తగీ నమః
పీవస్త్రా పహారాకాయ  నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహ రుపిణే నమః
ఓం పరాత్పరాయ నమః 108
                                                                
శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి సంపూర్ణం
ధూపం : పిదప అగరువత్తిని వెలిగించి .........
శ్లో || దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం
   ధూపం గృహాణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః ధూప మాఘ్రాపయామి .ధూపం సమర్పయామి. అంటూ ఎడమ చేత్తో గంట 
వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను. 
పిమ్మట మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్న అదనపు వత్తులలో ఒక దానిని 
తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం 
స్వామికి చూపుతూ .......
దీపం : శ్లో || త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక
              దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్త వత్సల ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా 
దీపారాదనలో వున్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే 
దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై 
శ్లోకమును చదువవలెను.
నైవేద్యం : శ్లో || సర్వ బక్ష్యైశ్చ భోజ్యైశ్చర సైశ్షడ్బి స్సమన్వితం
                   నైవేద్యం తుమయా సీతం గృహాణ పురుషోత్తమ ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః నైవేద్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క , పళ్ళు, 
కొబ్బరికాయ , అటుకులు ,స్వామికి ప్రత్యేకముగా చేసిన భక్ష్యములు మొదలగునవి 
స్వామీ వద్ద నుంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఓం శ్రీ కృష్ణాయ నమః 
నైవేద్యం సమర్పయామి ' ఓం ప్రాణాయ స్వాహా ,ఓం అపానాయ స్వాహా ,ఓం వ్యానాయ 
స్వాహా , ఓం ఉదానాయ స్వాహా ,ఓం సమానాయ స్వాహా, ఓం శ్రీ వాసుదేవాయ నమః ' 
అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో ) స్వామికి నివేదనం చూపించాలి
 . పిదప ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః నైవేద్యా నంతరం 'హస్తౌ ప్రక్షాళ యామి '
 అని ఉద్దరిణెతో పంచపాత్ర లోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర 
కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర )లో వదలాలి. తరువాత 'పాదౌ 
ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్ర లో ఉద్దరిణె తో వదలాలి. 
పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం 
.......
పూర్వాపోశనం : శ్లో || సుధారసం సువిపులం మయానీతంతుమాధవ |
                              గృహాణ కలాశా నీతం యధౌష్ఠ ముప భుజ్యతాం ||
శ్రీ
 కృష్ణాయ నమః పూర్వా పోశనం సమర్పయామి అని భోజనమునకు ముందు పరిషం 
పట్టినట్లుగా భావించి పంచపాత్రలోని నీటిని ఉద్దరిణెతో నైవేద్యమునకు ఉంచిన 
పదార్దాములపై చల్లి స్వామికి చూపించవలెను. 
మధ్యే పానీయం : శ్లో || పానీయం పావనం శ్రేష్ఠ మల్లికాది సువాసితం
                               కర్పూర వాసితం తోయం ప్రీత్యర్ధం మధుసూదన ||
శ్రీ
 కృష్ణాయ నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని భోజనము చేయునపుడు మధ్య మధ్య
 నీటిని ఇచ్చునట్లుగా భావించి మరొకసారి పంచపాత్రలోని నీటిని ఉద్దరిణెతో 
నైవేద్యమునకు ఉంచిన పదార్ధములపై చల్లి స్వామికి చూపించవలెను.
ఉత్తరాపోశనం : శ్లో || ఉత్తరా పోశనం గ్రాహ్యం
                            హస్త ప్రక్షాళనం కురుపాద ప్రక్షాళనం ||
శ్రీ
 కృష్ణాయ నమః ఉత్తరాపోశనం సమర్పయామి అని భోజనం పూర్తి అయిన తరువాత కొంత 
జలమును తీసుకుని ఆకు చుట్టూ తిప్పి పరిశం పట్టినట్లుగా భావించి తరువాత శ్రీ
 కృష్ణాయ నమః ఉత్తరా పోశానంతరం 'హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో 
పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా 
చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి . తరువాత ' పాదౌ ప్రక్షాళయామి '
 అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి . పునః శుద్దాచమనీయం 
సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.
తాంబూలం : శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
                        ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం ||
శ్రీ
 కృష్ణాయ నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ మూడు తమలపాకులు , రెండు పోక 
చెక్కలు వేసి స్వామీ వద్ద ఉంచాలి . తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు 
నీరు ఇస్తున్నామని తలుస్తూ ,'తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' 
అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి.
పిమ్మట కర్పూరం వెలిగించి .........
శ్లో || ఘ్రుతవర్తి సహస్తైశ్చ కర్పూర శకలై స్తదా ,
  నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో 
వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి ,మూడు సార్లు 
తిప్పుచూ ,చిన్నగా గంట వాయిన్చావలెను . అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి 
కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి " అని 
చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని 
కళ్ళకు అద్దుకోవాలి.
తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుని ..........
సువర్ణ పుష్పం : శ్లో || స్వర్ణ పుష్ప మిదం దేవ గృహాణ పురుషోత్తమ
                             కోటి సూర్య ప్రతీ కాశం స్వర్ణ పుష్పం మనోహరం .
ఓం శ్రీ కృష్ణాయ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకుని అక్షతలు , పువ్వులు ,చిల్లర స్వామి వద్ద ఉంచవలెను.
నమస్కారాన్ : శ్లో || శ్రీ కృష్ణ సర్వ లోకేశ నానా పుష్పై స్సురాజితై :
                           పుష్పాంజలి : ప్రదాశ్యామి గృహాణేశ మయార్పితమ్||
ఓం శ్రీ కృష్ణాయ నమః నమస్కారం సమర్పయామి అని స్వామికి నమస్కరించవలెను .
ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షణలు చేయాలి .
ప్రదక్షిణం : శ్లో || దేవ దేవ జగన్నాధా వాంచితార్ధ ఫలప్రద
                    ప్రదక్షిణం కరో మిత్వాం సంసారార్ణవ తారక ||
              శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ
                     తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి . చేతిలో అక్షతలు 
,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ పదక్షిణ చేసి (అనగా తమలో 
తాము చుట్టూ తిరిగి ) చేతిలో ఉన్న అక్షతలు మొదలగునవి స్వామిపై వేయవలెను.
సాష్టాంగ నమస్కారాన్ : శ్లో || కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ
                                         నంద గోప కుమారాయ గోవిందాయ నమోనమః ||
ఓం
 శ్రీ కృష్ణాయ నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి .అని స్వామికి సాష్టాంగ 
నమస్కారం (మగ వారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆన్చి , ఆడువారు మోకాళ్ళపై 
 పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి ) చేయవలెను. తరువాత స్వామిపై అక్షతలు 
పువ్వులు చల్లవలెను . మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ ........
 శ్రీ కృష్ణాష్టమీ వ్రత కల్పము 
ప్రార్ధన : శ్లో
 || అపరాధన సహస్రాణి క్రియతే హర్నిశం మయా | దాసా హమితి మాః మత్వా క్షమస్వ 
పురుషోత్తమా || తతో గందాక్షతై : పుష్పై : పూజయేచ్చంద్ర మండలం | తత్రార్ఘ్య 
పాత్రం నిక్షిప్య అర్ఘ్యే ద్రవ్యాణి నిక్షిపేత్ | జ్యోతిష్మతే నమస్తుభ్యం 
నమస్తే జ్యోతిషాం పతే | నమస్తే రోహిణీ కాంత సుధాకర నమోస్తుతే చంద్ర 
ప్రార్ధన మంత్రః జాతః కంస వదార్దాయ భూభారోత్తా రణాయచ | దానవానాం వినాశాయ 
వసుదేవ కులోద్భవ |శ్రీ కృష్ణాయ నమః  ప్రధమార్ఘ్యం సమర్పయామి పాండవానాం 
హితార్ధాయ ధర్మ సంస్థాప నాయచ | కౌరవానాం వినాశాయ వసుదేవ కులోద్భవ | శ్రీ 
కృష్ణాయ నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి . శ్రావణ్యాం కృష్ణ పక్షేతు అష్టమీ 
రోహిణీ యుతాతస్యాం చంద్రోదయే రాత్రౌ బాలకృష్ణ సముద్భవ : శ్రీ కృష్ణాయ నమః 
తృతీయార్ఘ్యం సమర్పయామి . క్షీరో దార్ణవ  సంభూత అత్రి నేత్ర సముద్భవ | 
గృహణర్ఘ్య మయాదత్తం రోహిణ్యా సహిత శ్శశిన్ శ్రీ కృష్ణాయ నమః చంద్రార్ఘ్యం 
యస్య స్మృత్యాచం వ్రతం సువ్రత మస్తు |
పునః పూజ : ఓం
 శ్రీ  కృష్ణాయ నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకుని , పంచ పాత్రలోని 
నీటిని చేతితో తాకి ,అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు 
చదువుకొనవలెను .
ఛత్రం
 ఆచ్చాదయామి ,చామరం వీజయామి , నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి .సమస్త 
రాజోపచార ,శక్త్యోపచార ,భక్త్యోపచార , పూజాం సమర్పయామి అనుకొని, 
నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .శ్లో || యస్య స్మృత్యాచ 
నామోక్త్యా తపం పూజా క్రియాది షు
    యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
ఏతత్ఫలం
 శ్రీ కృష్ణార్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట
 'శ్రీ కృష్ణ ప్రసాదం శిరసా గృ హ్ణామి' అనుకొని స్వామివద్ద అక్షతలు 
తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము 
నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి 
దేవుని పీటముపై ఉంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
శ్లో
 || యస్య స్మృత్యాచ నో మొక్త్యాత పః పూజా క్రియాది షు .న్యూనం సంపూర్ణతాం 
యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన , 
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే, అన్యా ద్యాన ఆవాహనాది షోడశోప చార 
పూజాయాచ భగవాన్సర్వాత్మకః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే స్సుప్రీతో వరదోభవతు , 
శ్రీ కృష్ణ పరమాత్మ ప్రసాదం శిరసాగృహ్ణామి అని దేవునికి నమస్కరించి 
ప్రసాదమును స్వీక రించవలెను.
పూజా విధానం సంపూర్ణమ్
శ్రీ కృష్ణాష్టమి వ్రత కధా ప్రారంభము                 
 ముని శ్రేష్టుడైన నారదుడు లోకహితమునకై సత్య లోకమునకు పోయి అచ్చట శ్వేత 
పద్మాసమున కూర్చుని యున్న బ్రహ్మ దేవుని చూచి సాష్టాంగముగ నమస్కరించి శ్రీ 
కృష్ణాష్టమి వ్రత మహత్యము వినగోరు చున్నానని వినయముతో పలికెను . అందుకు 
బ్రహ్మ దేవుడు ఇలా పలికెను నారదా ! కలి కల్మషములను భస్మము చేయునదియు, 
జయమును సుకృతమును కలుగ జేయునదియు అయిన శ్రీ కృష్ణా ష్టమి వ్రత  ప్రభావము 
చెప్పెదను వినుము అని పలికి జయంతినాడు కృష్ణుని స్మరించిన మాత్రముననే ఏడు 
జన్మల దుష్క్రు తములు మిగలక నిర్మూలనము అగును. ఆ రోజు ఉపవాసము చేసిన వారికి
 పాపములన్నియు నశించి పోవుననుటలో సందేహము లేదు
ఈ కృష్ణా ష్టమి పరిశుద్ద మైనది,పాపములన్ని పోగొట్టునది అయిన ఈ వ్రతమును ఆచరించిన వారికి అశ్వ మేధయాగము చేయగా వచ్చునంత పుణ్య ఫలమును , సమస్త తీర్దములలో స్నానము చేసిన ఫలమును లభించును. కృష్ణాష్టమి రోజున ఎవరు ఉపవాసము చేయుదురో వారు వెయ్యి గోవుల దాన మిచ్చిన ఫలమును రత్నకోటి సహస్ర దాన ఫలమును ,పదివేల గుఱ్ఱములను దాన మిచ్చిన ఫలమును, వెయ్యి ఏనుగులను దానము చేసిన పుణ్యమును ,వెయ్యి కనకాభరణములు కురుక్షేత్రమున కిచ్చిన ఫలమును, కోటి కన్యా దాన ఫలమును పొందుదురు .గురువు కొరకు గాని ,బ్రాహ్మణోత్తముల కొరకు గాని ,యజమాని కొరకు గాని ,దేహత్యాగము చేయునంత ఫలమును, ఆపన్నులకు ఆపద పోగొట్టు ఫలమును ,తీర్ధ యాత్ర చేయువారి పుణ్యమును ,సత్యవంతులకు కలుగు పుణ్యమును పితృ ప్రీతిరకముగ చేయు ధర్మ శ్రాద్దముచే కలుగు పుణ్యమును ,ద్వాదశ తిది పారాయణము చేయువారికి కలిగెడు సుఖమును కలుగును. శ్రీ కృష్ణ జయంతి నాడు ఉపవాసము చేసి ,జాగరణము చేయువారికి ఈ సుఖములు ,పుణ్యములు కలుగును.
ఇదికూడా కాక ధర్మ వేత్తలును ,సత్యవంతులు అయిన అంబరీష ,గాది ,శిశుపాల మొదలగు రాజులచే ఈ కృష్ణా ష్టమి వ్రత మాచరించ బడినది. వారు అశేష రాజ్యము పొంది భూమండలము పాలించుచూ చివరకు ఈ కృష్ణుని అనుగ్రహము చేత వైకుంటమును చేరిరి .ఇంకా వాల్మీకి ,వాలఖిల్య , వశిష్ట , గౌతమ ,జమదగ్ని మొ||గు మహర్షులందరు కృష్ణుడు జన్మించిన శ్రావణ మాస రోహిణీ నక్షత్రముతో కూడిన కృష్ణ పక్ష అష్టమీ దినమునందు ఈ వ్రతము ఆచరించిరి. ప్రతి జన్మయందు గల పాపములు చక్రపాణి యొక్క పాదముల అనుగ్రహముచే తొలగి పోవును. ఈ వ్రతము సమస్త కోరికలను ఇచ్చునది కావున ముకుందుని భక్తితో ఉపవాసముండి పూజించినచో సమస్త దోషములు తొలగి అష్టైశ్వర్యములు ప్రాప్తించి కోటి జన్మ పుణ్యము సంభవించును. కృష్ణాష్టమి నాడు ఉపవాసముండక భుజించిన పాపములు వచ్చును. ఈ వ్రతమును నిందించినచో అనేక పాపములను పొందుదురు .
ఓ నారదా ! శ్రీ కృష్ణ జయంతి రోజున శ్రీ కృష్ణ పూజను ఎవ్వరు ఆచరింతురో ,వారి విషయమున దేవకీ దేవి పుత్రుడై అవతరించిన పురుషోత్తమునితో కూడి సంతోషముతో నుందురు. కావున ప్రతిదినమూ దేవకీ సహితుడైన హరిణి ఆరాదించు మానవులు విష్ణు పదమును పొందుదురు. ఈ జన్మాష్టమి వ్రతము చేయు విప్రోత్తములు (బ్రాహ్మణులు ) జన్మ సిద్ది పొందుదురు .వాసుదేవ స్మరణచే రాజు ,దైవము, అగ్ని, సర్పము,వాయువు, జలము వలన కలుగు భయములు పోవును .పశువులు ,ధనము ,ధాన్యములు వర్ధిల్లును ఇహలోకమున కుటుంబ వృద్ది కలిగి అంతమున మోక్షము కలుగును .శ్రీ విష్ణు పధము పొందుదురు. రోగ దుఃఖ బాధలవలన కలుగు భయము తొలగును .కలహము ఉపద్రవము కలలోనైనను కలుగవు. మరియు ఇంకొక విశేషము కలదు. ఈ వ్రతము రోహిణీ నక్షత్రము బుధవారముతో కూడుకున్న దైనచో అట్టి సమయమున ఆచరించిన వారికి కులోద్దరణ ,అన్నింటా విజయము కలుగును .
    ఓ నారదా ! ఇన్ని ఏల మాతా పితరుల (తల్లి, తండ్రి ), గురువుల పూజలవలన కలుగు ఫలము కలుగును. అని బ్రహ్మ దేవుడు పలుకగా నారదుడిట్లు పలికెను .
ఓ పితామహా ! శ్రీ కృష్ణ జయంతి వ్రతము ఎట్లు చేయవలెను ? దీని విధానము ఎట్టిది ? నాకు ఉపదేశింపుము అనినంతనే చతుర్ముఖుడు ఇలా చెప్పు చుండెను .
ఓ నారదా మొదటగా సనత్కుమారుడు హరిశ్చంద్రునిచే ప్రార్దింప బడి అతనికి ఈ వ్రతమును ఉపదేశించెను . ఏ వ్రతమైనను నియమముచే ఆచరింప బడినచో ఫలితము ఉండును నియమము లేక చేసినచో వ్రతము శ్రేయస్సు కలుగదు.కావున భక్తి యుక్తుడై ,శుచిర్భూతుడై ఈ వ్రతము చేయు రోజున ఉపవాసముతో ఉండి,మధ్యాహ్న కాలమున బార్యా బిడ్డలతోనూ ,స్నేహితులు ,బందువులు మొదలగు వారితోను కూడి ఇంటిలోనైనను , వైష్ణవ ఆలయములో నైననూ ,ఆవు పేడతో నైననూ ,నీటితో నైననూ స్థలమును శుబ్రము చేసి ,ముగ్గులు వేసి ,ఒక శుద్దమైన కుండను తెచ్చి దానియందు శుద్ధ జలమును పోసి, అడుగున బియ్యము పోసి ,ఒక పీటముపై ఆ ఘటము (కుండను ) పెట్టి గంధము, పుష్పములు, అక్షతలు మొదలగు వాటిచే అలంకరించి వస్త్రము చుట్టి ఆ కలశము మీద శక్తి కొలది బంగారం చే చేయబడిన బాల కృష్ణుని ప్రతిమను (బొమ్మను ) పెట్టి (శక్తి లేనివారు పంచ లోహ ప్రతిమను కూడా పెట్టవచ్చును.) యధావిధిగా పూజించవలెను. శాస్త్రోక్తముగా చేయనివారు నరక ప్రాప్తి పొందుదురు .ఏ ధర్మ మైనను యధావిధిగా నియమములతో ఆచరింపవలయును.
శ్రీ కృష్ణాష్టమీ వ్రత కల్పము దేవకీ గర్భము నుండి జగజ్జనకుడైన జనార్ధనుడు జన్మించు సమయమున జాతకర్మాదులు (అనగా శిశువు జన్మించి నంతనే ఆచరించు శుభ కర్మలు ) చేయించినట్లుగా భావించి తనకున్న శక్తి కొలది భక్తితో గోవు, భూమి, బంగారం ,ధాన్యం, పండ్లు, వస్త్రములు ఇలా ఎవరి శక్తి కొలది వారు దానములు చేసి ఈ క్రింది పురాణ శ్లోకములను పటించవలెను.
శ్లో || అదితే దేవ మాత స్త్వం సర్వ పాప ప్రణాశిని
    అతస్త్వాం పూజయిష్యామి భేతోహం భావ సాగరాత్ ||
శ్లో || పూజితాసి యధా దేవై: ప్రసన్నాత్వం వరాననే
   పూజితాచ యధా భక్త్యా ప్రసాదం కురు సువ్రతే ||
శ్లో || యయా రాత్రౌ హరిం రత్ద్వా ప్రాస్తాత్వం నిర్త్వతిం పరాం
   తామేవ నిర్వృతం దేహి సుపుత్రం ధర్మ యస్వమే ||
శ్లో || అవతార సహస్రాణి కరోతి భగవాన్ హరి :
  తేషాం చైవ తుమా హత్మ్యం కచ్చి జ్ఞానాతి వైభువి ||
శ్లో || దేవ బ్రహ్మాద యోయేపి స్వరూపం నవిదుస్తవ
  అతస్త్వాం పూజయిష్యామి మాతు రుత్సంగ సంస్థితం ||
శ్లో || వాంచితం కురుమే తత్ర దుష్కృతం చివా నాశయ
   కృపాం కురుష్వమే దేవ సంసారార్తి భయాపహ ||
అను
 ఈ శ్లోకములతో కృష్ణుని ప్రార్ధన చేసి అర్ధ రాత్రి సమయమున ఆవాహనాది 
షోడశోపచార పూజను చేసి ,చంద్రుడు ఉదయించు సమయానికి బయటకు వచ్చి , అక్కడ 
ముగ్గులతో అలంకరింపబడిన భూమి యందు పూవులు ,పండ్లు , గంధం మొదలగు వాటిని 
,చంద్రుని కొరకు అర్ఘ్యమును ,శంఖముతో నీటిని తీసుకుని (శంఖ మనగా శ్రీ మహా 
విష్ణువు ధరించునది ఇది సముద్రపు ఒడ్డున గాని పేరు పొందిన దేవాలయ సమీపము 
లందు గాని దొరుకును ). శంఖములో కొబ్బరి నీరు తీసుకుని పూజా పాత్రలైన 
పంచపాత్ర ,అర్ఘ్య పాత్ర , ఉద్దరిణ మొదలగు సామాగ్రిని దగ్గర పెట్టుకుని 
క్రింది శ్లోకములతో పూజింప వలయును.
శ్లో || జాతః కంస వదార్దాయ భూభారోత్త రణాయచ ,
   పాండవానాం హితార్దాయ ,ధర్మ సంస్థాప నాయచ ||
శ్లో || కౌరవాణాం వినాశాయ వాసుదేవ కులోద్భవ
  దేవకీ గర్భ సంభూత ,భక్తానామ భయప్రద
  గృహణర్ఘ్యం మయాదత్తం ప్రసీద పురుషోత్తమ
అను
 ఈ శ్లోకములతో శ్రీ కృష్ణునికి ప్రీతి కలుగు విధముగా అర్ఘ్యమును ఇచ్చి ఆ 
రాత్రి భగవత్ కథలచే ప్రీతి కలిగించి ,జాగరణ చేసి ,నైవేద్యము , తాంబూలము 
ఇచ్చి కర్పూర నీరాజనం ,గీతము ,నృత్యము మొదలగు వాటిచే పూజింపగా జన్మ 
జన్మలలోని దుఃఖములు ,పాపములు అన్నియు తొలగి పోవును.
ఇంతే కాక మరునాడు స్నానము, సంధ్యా వందనము శుద్దమైన మనసుతో చేసుకొని ,అనేక రుచులతో కూడిన పిండివంటలు , పాయసాన్నములు మొదలైన వాటిచే బ్రాహ్మణ ,స్త్రీ ,బాలుర, వృద్దుల ,స్నేహితుల ,బంధువుల నందరిని తృప్తి పరచవలెను. తాము కూడా భుజించవలెను. ఈ వ్రతమును విధి విదానముగా చేయువారికి వ్రత మహిమచే దౌర్భాగ్య ,వైధవ్య దుఃఖములు తొలగిపోవును. ఇంతే కాక ,ఇరవై ఎనిమిది కోట్ల ఎకాదశులు ఉపవాసమున్న ఫలము కలుగును. ఇంకా ఈ వ్రత మహిమచే వీణా వేణు మృదంగము మొదలగు వాద్యములు కలిగియున్నవి మానములను ఎక్కి గరుడవాహనముగా కలవాడైన విష్ణు దేవుని యొక్క సన్నిధికి చేరుదురు .దుష్ట దేశములను పడగొట్టు రీతిన ఈ శ్రీ కృష్ణ జయంతి వ్రతము పాపములను తొలగించును. ఈ వ్రతము చేయనిచో ఎన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు .కావున నారదా ! నీవుకూడా ఈ వ్రతము చేయుము. నిజము చెప్పుచుంటిని మొదటగా హరిశ్చంద్రుడు ఈ వ్రతమును చేసి సిద్ది పొందెను. ఈ వ్రతము ధర్మార్ధ కామ మోక్షములను ఇచ్చునది . ఈ వ్రతము ఒక పుస్తకముగా వ్రాయబడి ఎవరి ఇంటిలో ఇది పూజింప బడునో వారికి నారాయణ సాన్నిధ్యము కలుగును. శక్తికి తగిన విధముగా ఈ వ్రతము చేయువారు అన్ని పాపములు తొలగింప బడి సర్వ వేదములను చదివిన ఫలమును పొంది ,పరమ పవిత్రమైన పురుషోత్తముని దగ్గరకు చేరుకొందురు. ఈ వ్రతము చేయుటవలన భార సహస్ర స్వర్ణ దాన ఫలము (అనగా వెయ్యి బంగారు నాణెములు దానం చేసిన ఫలము) లభించును. ఇలా ఈ వ్రతము చేసి ప్రతిమా వస్త్రాలంకార భూషణ తాంబూలము దక్షినాదులతో అనగా శక్తి కొలది బట్టలు ,ఆభరణములు ,తాంబూలము ,దక్షిణ ,ప్రతిమ అనగా బొమ్మ బంగారము ,వెండి లేదా మట్టిదైననూ బ్రాహ్మణునకు దాన మిచ్చినచో ఇహ లోకమున పుత్ర పౌత్ర ఐశ్వర్య సుఖములన్నియు అనుభవించి చివరకు అనంతుని పాదారవిందముల వద్ద చేరుదురు .ఇలా చెప్పిన బ్రహ్మ దేవుని మాటలకు నారదుడు ఆనందము పొందిన వాడయ్యెను.
                                                     కృష్ణాష్టమి వ్రత కధ సంపూర్ణం.


మరింత సమాచారం తెలుసుకోండి: