దీపావళి నాడు పగలంతా పిండివంటలు, పూజలతో గడిచిపోతుంది. సాయంత్రం వేళ అసలైన సందడి కనిపిస్తుంది. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు టపాసులు కాల్చడంలో లీనమైపోతారు. మార్కెట్ లో దొరికే రకరకాల టపాసులతో హుషారుగా సంబరం చేసుకుంటారు. కానీ దివ్వెల దీపావళి చేదు జ్ఞాపకం కాకూడదంటే తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

Image result for diwali fires

దీపావళి పండుగ ఇంటికి దీప కాంతులు తీసుకొస్తుంది. పిల్లలందరూ కేరింతలు కొడుతూ సరదాగా సందడి చేస్తుంటారు. వాళ్లని చూసి పెద్దలు మురిసిపోతుంటారు. కానీ ఆ రోజు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే పండగ వాతావరణం పాడవకుండా ఉంటుంది. దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టేటప్పుడు డోర్ కర్టెన్లకు దూరంగా ఉంచాలి. లేదంటే అవి అంటుకునే ప్రమాదం ఉంటుంది. దీపావళి రోజు చాలా మంది కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. కానీ సాయంత్రం టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా కాటన్ దుస్తులే ధరించేలా చూడాలి. పిల్లలకు చేతులు కాళ్లు పూర్తిగా కవర్ అయ్యేలా కాటన్ బట్టలు వెయ్యాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సిల్క్ గానీ పాలిస్టర్ దుస్తులు కానీ వేసుకోకూడదు. ఒకవేళ దుస్తులపై నిప్పు రవ్వలు పడి అవి రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదా రగ్గులను కప్పి మంటలను నిరోధించాలి.

Image result for diwali fires

చుట్టు పక్కల గుడెసులు ఉంటే... వాటి పైన నిప్పురవ్వలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాకెట్ల లాంటివి కాల్చుతున్నప్పుడు గుడెసలకు దూరంగా కాల్చాలి. ఫైర్ సర్వీసెస్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచుకుంటే మంచిది. టపాసులు కాల్చేటప్పుడు ముందు జాగ్రత్తగా బర్నాల్, దూది, టించర్, డెటాల్ వంటివి దగ్గర పెట్టుకోవాలి. ప్రమాదవశాత్తు చేతులు కాలితే.. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి.

Image result for diwali fires

పిల్లలకు దీపావళి టపాసులంటే చాలా సరదా ఉంటుంది. అవి కాల్చాలన్న తొందరలో పిల్లలు కాళ్లకు చెప్పులు వేసుకోవడం కూడా మరచిపోతారు. కాబట్టి పిల్లలు టాపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరగా ఉండాలి. తప్పనిసరిగా చెవిలో దూది పెట్టాలి. ఎందుకంటే చిన్నవయస్సు వారికి కర్ణభేరి లేతగా ఉంటుంది. భారీ శబ్ధాల వల్ల వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.

Image result for diwali fires

లక్ష్మీ బాంబులు, సీమ టపాసులు కాల్చేటప్పుడు.. దూరంగా ఉండి అంటించాలి. అగ్గిపుల్లతో కాకుండా పొడవాటి కాకరపువ్వొత్తులు దొరుకుతాయి. వాటితో అంటిస్తే మంచింది. సీమటపాసులు కాల్చేటప్పుడు ముఖ్యంగా 1000వాలా, 10,000వాలా సీరీస్ కాల్చేటప్పుడు జన సమర్థం లేకుండా చూసుకోవాలి. ఆ దారి గుండా వచ్చే వాళ్లని గమనించాలి.

Image result for diwali fires

భూ చక్రాలు కాల్చాలనుకునే వాళ్లు కచ్చితంగా పాదరక్షలు ధరించాలి. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై ఉంచకండి. దీపావళి సామాగ్రికి సమీపంలో దీపం, కొవ్వొత్తులు, అగరవొత్తులు ఉంచకూడదు. వెలిగి పేలకుండా ఆరిపోయిన చిచ్చుబడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్లి పరిశీలించకూడదు. మళ్లీ వాటిని వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం. చిచ్చుబడ్లు వగైరా వెలిగించేటప్పుడు మొహం దగ్గరగా పెట్టకుండా చూసుకోవాలి. వాహనాలకు దగ్గరలో టపాసులు కాల్చొద్దు. సాధ్యమైనంత వరకు వాహనాలు రోడ్డు మీద ఉండకుండా లోపల పెట్టాలి. కచ్చితంగా కవర్ కప్పి ఉంచాలి.

Image result for diwali fires

కాకర పూవొత్తులు కాల్చిన తర్వాత ఆ ఊచలను నీళ్ల బకెట్లో వేయాలి. లేదంటే వాటిని తొక్కడం వల్ల వేరే వాళ్లకు గాయమయ్యే ప్రమాదం ఉంది. అది మీరు కూడా కావచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ, ఏయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కు కారణం కాకుండా ... దివ్వెల పండగను సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోండి. ఎటు వంటి ప్రమాదలకు తావివ్వకుండా సందడిగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ పాఠకులందరికీ ఏ వెరీ హ్యాపీ దివాళి.


మరింత సమాచారం తెలుసుకోండి: