పంచ భూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణి కోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మ గరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగించటం ద్వారా ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచర మవుతాయి. "నీలము, పసుపు, తెలుపు" - ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన "సత్త్వరజస్తమో గుణాల" సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావి స్తారట పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం - అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా స్వీకరిస్తారు భారతీయులు.


Related image


"అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ  - ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే"


అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి, అమావాస్యలు పరమపవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.


Related image


"త్రిప్పు త్రిప్పూ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి" అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్నచిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీసినట్లు త్రిప్పటం గ్రామీణ  సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణదిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటి లోపలకు వచ్చి మధుర పదార్థం తింటారు.


అటు తరువాత పూజా గృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీప లక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజా నంతరం అందరూ ఉత్సాహంగా బాణా సంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చు బుడ్లు, విష్ణు చక్రాలు, భూ చక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు, కళ్ళు మిరు మిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమ టపాకాయల ఢమ ఢమ ధ్వనులతో పరిసరాలన్నీ ద్వనిస్తూ ఉంటాయి. ఈ విధంగా బాణా సంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్ద తరంగాలలో దారిద్య, దు:ఖాలు దూరంగా తరిమి వేయ బడి లక్ష్మీ కటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమి కీటకాలు బాణా సంచా పొగలకి నశిస్తాయని అంటారు. అదీ నిజమే కదా! ఆధ్యాత్మికతతో ఆరోగ్యం సంప్రాప్తం.


Image result for sri maha lakshmi devi images


అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీప లక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది. దీపావళి చుట్టూ ఇంకా అనే కానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథ కూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చి నప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగ ల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.


హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు, సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుల తో ప్రతి ఇల్లు కళ కళ లాడుతుంది. దీపావళి పండుగ అంటే చాలు గుర్తుకు వచ్చేది టపాకాయలు. చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం, మతం అనే బేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ప్రత్యేకమైన పండుగ ఒక్క దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆశ్వయుజ మాసంలో శుద్ద చతుర్దశి తొలి రోజు నరక చతుర్దశి, మరు రోజు అమావాస్య దీపావళి, మూడవ రోజు బలి పాడ్యమి. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదిన మైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు.


Image result for sri maha lakshmi devi images


నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీలకు, వ్యాపార వర్గాలకు ఈ రోజు లక్ష్మీపూజాదినం. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహా లక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మహిళలు ఎక్కువగా నమ్ముతారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస అని అర్ధం అందుకే దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.


దీపావళి పండగ గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో రాముడు 14 ఏళ్ల వనవాసం తరవాత రావణుడిని చంపి ఆయోధ్యకు తిరిగి వస్తాడు. రాముడు రావణుడి ని చంపిన రోజుని విజయదశమిగా అంతే దసరాగా జరుపు కుంటారు.


ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో, ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్య దిన సాయం సంధ్య కాల మందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి, శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి 'చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" అని ధ్యానించి, తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహా లక్ష్మి కాలిఅందియలు ఘల్లు ఘల్లు మని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం. మరి మహీళలూ మీ ఇలాంతా దీపాల వరుసలతో వెలుగులీనేలా చెయ్యండి మహా లక్ష్మిదేవి ఆశీస్సులు పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: