six dharmas for women as per hindu dharma కోసం చిత్ర ఫలితం


స్త్రీ ఎలా ఉండాలో (‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ) అనే కాదు...,పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం  చెప్పింది..కానీ ఎందు చేతో ఈ పద్యం జన బాహుళ్యంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. పురుషాధిఖ్య సమాజం కాబట్టి, సమాజంలో పురుషుడు తన ధర్మాలను మరచి పోవటమే కారణం కావచ్చు. కాని స్త్రీకి మాత్రం షట్ధర్మాలను (ఆరు ధర్మాలు)  నిర్వచించాడు.


జీవన ప్రధాన లక్ష్యాలైన "ధర్మ అర్ధ కామ్య మోక్షాల" ను సాధించటానికి జీవిత భాగస్వాములైన, స్త్రీ - పురుషులకు భారతీయ ధర్మ, నీతి శాస్త్రాలు కొన్ని నిర్దేశిత సాంఘిక అనుసరణీయ ధర్మాలను బోధించింది. ధర్మ శాస్త్రం దృష్టి లో స్త్రీ పురుషులు సమానులే కాని, ధర్మాచరణలో స్త్రీ కి కుటుంబాన్ని అతి ముఖ్య భాధ్యతగా పెట్టి పురుషుణ్ణి చాలా విషయాల్లో వదిలేసింది.  


karyeshu yogi కోసం చిత్ర ఫలితం

 

మనుధర్మం పురుషునికోసం నీతిశాస్త్రం నిర్వచించిన ఆరు ధర్మాలను సంస్కృత శ్లోకంలో ఇలా చెప్పబడింది. 

 

 కార్యేషు యోగీ, కరణేషు దక్షః 

 రూపేచ కృష్ణః క్షమయా తు రామః

 భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం

 షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః  


karyeshu yogi కోసం చిత్ర ఫలితం


--> కార్యేషు యోగీ :

 పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 

 --> కరణేషు దక్షః 

 కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

 --> రూపేచ కృష్ణః

 రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,  సంతోషంగా ఉండాలి. 

 --> క్షమయా తు రామః

 ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

--> భోజ్యేషు తృప్తః

 భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. 

--> సుఖదుఃఖ మిత్రం

సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రునివలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

 

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ  పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.


సంబంధిత చిత్రం 

మరింత సమాచారం తెలుసుకోండి: