తిరుమల దర్శనం ఈ రోజు రద్దీ: పెరిగింది  శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 34 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.(వై.క్యూ.కాంప్లెక్స్-1తో కలిపి)సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా 3 గంటలలో దివ్య దర్శనం పూర్తవుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.


నిన్న నవంబరు 23 న 68,723 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌నిన్న 36.635 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.17 కోట్లు.నిన్న స్వామి వారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు గోసంరక్షణ ట్రస్టు: ₹ 11.00 లక్షలు ఆరోగ్యవరప్రసాదిని: ₹ 1.55 లక్షలు విద్యాదాన ట్రస్టు: ₹ 0.17 లక్షలు వేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.5 లక్షలు 

గురువారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
శుక్రవారం ప్రత్యేక సేవ:
అభిషేకం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఈ రోజు 24.11.2017  శుక్రవారం
ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.00 - 4.00
సల్లింపు, శుద్ది, 
నిత్యకట్ల కైంకర్యాలు,
వేకువ ఘంటారావం,
అభిషేకానికి ఏర్పాట్లు
ఉ. 4.30 - 6.00
ప్రత్యేక సేవ: అభిషేకం
నిజపాదదర్శనం
ఉ. 6.00 - 7.00
సమర్పణ
ఉ. 7.00 - 8.00
తోమాల సేవ, అర్చన
 (ఏకాంతం),
ఉ. 9.00 - రా. 8.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 6.00 - 8.00
సహస్రదీపాలంకరణ సేవ
(కొలిమి మండపం వద్ద),
తిరుమాడ వీధులలో ఊరేగింపు
రా. 8.00 - 9.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 9.00 - 10.00
సర్వదర్శనం
 
రా. 10.00 - 10.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 10.30  ఏకాంతసేవ
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
         శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము
       రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాః
శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః
_శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ !!_14
తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.



మరింత సమాచారం తెలుసుకోండి: