ప్రపంచంలో క్రికెట్ అంటే ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు..ఏ దేశంలో అయినా ఈ క్రిడకు ఉన్నంత పాపులారిటీ ఏ క్రీడకూ లేదంటే అతిశక్తి లేదు. చిన్న చిన్న పల్లెటూళ్లలో సైతం క్రికెట్ అంటే పిచ్చిగా అభిమానించేవారు ఉన్నారు. ఇక భారత దేశంలో క్రికెట్ అంటే మహా పిచ్చి ఉన్నవారు ఉన్నారు. ముఖ్యంగా భారత్ క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ తెలియని వారు ఉండరు.. చిన్న వయసులోనే క్రికెట్ రంగంలోకి వచ్చిన సచిన్ అద్భుతాలు సృష్టించారు.


అందరితో సన్నిహితంగా ఉండటం ఎప్పుడూ చిరు నవ్వుతో పలకరించడం సచిన్ లో మిన మంచి లక్షణాలు అలాంటిది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కోపమొచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సచిన్ టెండూల్కర్ చిరాకుపడ్డాడు. ఇందుకు బ్రిటిష్ ఎయిర్‌వేసే కారణం. ప్రస్తుతం ఆల్‌స్టార్ క్రికెట్ టోర్నీ కోసం అమెరికాలో ఉన్న సచిన్ తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించడంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించాడు.


అభిమానులకు అభివాదం చేస్తున్న సచిన్ టెండుల్కర్


సచిన్ ఎవరు ? పూర్తి పేరు ఏంటి ? అడ్రస్ ఎక్కడ ? ఈ ప్రశ్నలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. బ్రిటిష్ ఎయిర్ వేస్ వ్యవహార సరళితో తాను అసహనానికే కాక అసంతృప్తి, ఆగ్రహానికి కూడా గురయ్యానని సచిన్ వ్యాఖ్యానించారు. లగేజీ కూడా తాము సూచించిన ప్లేస్ కాకుండా వేరొక ప్రాంతానికి తరలించిందని శివాలెత్తారు. ప్రపంచం గుర్తించిన క్రికెట్ దిగ్గజానికి ఇలాంటి అవమానం జరగడంతో సచిన్ అభిమానులు అగ్గలం మీద గుగ్గిలం అవుతున్నారు. 

సచిన్ ట్విట్స్:

మరింత సమాచారం తెలుసుకోండి: