ఫ్రీడమ్ సిరిస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది.  దక్షిణాఫ్రికాలో డైనమైట్ లాంటి ఆటగాడు  పేసర్ డేల్ స్టెయిన్ కాలికి తీవ్ర గాయం కారణంగా రెంవడ టెస్టుకు దూరం అయ్యారు.  నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్నరెండో టెస్టుకి పేసర్ డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. టీమిండియాతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శనివారం నుంచి ప్రారంభం  కానున్న రెండో టెస్టుకు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ తప్పుకుంటున్నట్లు సమాచారం.  

చీలమండల గాయం కారణంగా భారత్‌తో ఆడనున్న రెండో టెస్టుకు ఆడలేక తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. రెండో టెస్టు మ్యాచ్ కోసం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యాడు. ఏబీ డెవిలియర్స్ 100వ టెస్టు మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు టెస్టు కెప్టెన్ హషీం ఆమ్లా శుక్రవారం పేర్కొన్నారు.  నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 1-0తేడాతో ముందంజలో ఉంది.

డేల్ స్టెయిన్ 

 Dale Steyn ruled out of 2nd Test against India in Bengaluru

మొహాలీలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  దీంతో ముగ్గురు ప్రధాన పేసర్లు లేకుండా దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతుండటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. కాగా రెండో టెస్టు బెంగుళూరులో శనివారం  నుంచి ప్రారంభం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: