ఆస్టేలియా క్రికెట్ జట్టులో వెన్నుముకలాంటి వాడు.. తన బౌలింగ్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవాడు.  తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. టెస్టుతో పాటు వన్డే, ట్వంటీ-20 అన్ని ఫార్మాట్ల నుంచి ఒకేసారి రిటైర్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే  జాన్సన్ హాఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంపై షాక్ తిన్నారు.

34 ఏళ్ల వయసున్న మిచెల్ జాన్సన్ సుదీర్ఘకాలం పాటు ఆస్ట్రేలియా బౌలింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. 73 టెస్టులు ఆడిన 34 ఏళ్ల జాన్సన్ మొత్తం 311 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో అత్యధిక టెస్టు వికెట్లు తీసుకున్న వారిలో షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్‌గ్రాత్(563), డెన్నిస్ లిల్లీ (355) ఉన్నారు. 2007లో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో జాన్సన్ చోటు సంపాదించాడు. 2008లో సౌతాఫ్రికాపై 61 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు.రిటైర్మెంట్ ప్రకటించిన జాన్సన్‌కు సచిన్ టెండూల్కర్ తన శుభాభినందనలు తెలిపాడు. 


మిచెల్ జాన్సన్ 


సచిన్ ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: