భారత దేశంలో క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్లు ఉన్నారు. క్రికెట్ ఓ దేవాలయం అయితే అందులో దేవుడు సచిన్ అనే నానుడి కూడా ఉంది. చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టి ఎన్నో సంచలనాలు సృష్టించి సచిన్ టెండుల్కర్ గత సంవత్సరం రిటైర్ మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిస్తున్నాడు.  ప్రస్తుతం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జూనియర్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.ముంబై అండర్-16 జట్టుకు అర్జున్ ఎంపికయ్యాడు. 

డిసెంబర్ 1 నుంచి 3 వరకు బరోడాలో జరిగే విజయ్ మర్చెంట్ ట్రోఫీకి గురువారం ప్రకటించిన జట్టులో అర్జున్ స్థానం సంపాదించాడు. ముంబై, బరోడాల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ట్రోఫీలో ముంబై జట్టుకి అంకొలేకర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం  మాస్టర్ బ్లాస్టర్ స్కూల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన పాఠశాల స్థాయి అండర్-16 టోర్నీలో కూడా అర్జున్ టెండూల్కర్ 42 బంతుల్లో 118 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

క్రికెట్ మైదానంలో మాస్టర్ బ్లాస్టర్ అర్జున్ టెండుల్కర్


ముంబై-16 జట్టుకు ఆటగాళ్ల ఎంపికలో భాగంగా ఈ మ్యాచులు నిర్వహించారు. ఇక తన కొడుకు సామాన్యమైన క్రీడాకారునిలా చూడాలే తప్ప తండ్రి ఇమేజ్ అతనిపై ఏమాత్రం పడవద్దని అలాగే తన కొడుకునే ఫోకస్ చేయవద్దని  మొదటి నుంచి మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు సచిన్ టెండుల్కర్. క్రీడలో రాణించాలంటే స్వతహాగా కష్టపడాలి కానీ తల్లిదండ్రుల ఇమేజ్ పడవద్దని ఆయన అభిప్రాయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన కూడా కష్టపడి పైకి వచ్చిన వాడే దట్ ఈజ్ సచిన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: