భారత బౌలర్లు మాయాజాలం చేశారు..ముఖ్యంగా స్పిన్నర్స్ సఫారీల దుమ్ము దులిపారు.  దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించి భారత్ గెలుపునకు కారణమైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. నాగ్‌పూర్ విసిఏ స్టేడియంలో శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అశ్విన్.. మ్యాచులో మొత్తం 12 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

 అశ్విన్ ఒక ప్రపంచ స్థాయి స్పిన్నర్ అని కొనియాడాడు. నాగ్‌పూర్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని సాధించింది. స్పిన్‌కు అచ్చొచ్చిన ఈ పిచ్‌పై భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించడంతో కోహ్లీ సేన 124 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.  ఈ మ్యాచ్‌లో 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 185 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

ఆనందంతో ఎగిరి గంతేస్తున్న కెప్టెన్ కోహ్లీ


ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్, ఆమ్లాల చెరో 39 పరుగులు మినహా మరెవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 7 వికెట్లు లభించగా, మిశ్రాకు 3 వికెట్లు లభించాయి.భారత ప్రధాన స్పిన్నర్ అశ్విన్ అని కోహ్లీ పేర్కొన్నాడు. ‘అశ్విన్ ప్రపంచ స్థాయి స్పిన్నర్. శ్రీలంక పర్యటనలో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. జట్టులో అతడు ఉండబట్టే తాము వరుసగా గెలుస్తున్నాం అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: