వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్ లో లోపాలు ఉన్నట్లు..  నరైన్‌ 15డిగ్రీల కోణాన్ని మించి, మోచేయిని వంచుతూ నారాయణ్ బౌలింగ్ చేస్తున్నట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా అతనిపై నిషేధం విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. బౌలింగ్‌కు సంబంధించి గతంలోనూ విమర్శలు ఎదుర్కొన్న నరైన్‌ తన బౌలింగ్‌ మార్చుకోకపోవడం విశేషం. ఇప్పటివరకు పలువురు ప్రత్యర్ధి ఆటగాళ్లు అతడి బౌలింగ్‌ యాక్షన్‌ సరిగా లేదని ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ క్రమంలో అతడి బౌలింగ్‌ను ఐసిసి ఏర్పాటు చేసిన ప్యానెల్‌ పరిశీలించి నిబంధనల్లోనూ 6.1 ఆర్టికల్‌ ప్రకారం అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇది వెంటనే అమల్లోకి రానుందని పేర్కొంది. ఏడాది తర్వాత జట్టులోకొచ్చిన సునీల్ ఇటీవలే శ్రీలంకతో మూడో వన్డేలో సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌కు పాల్పడిన విషయం తెలిసిందే.

సునీల్‌ నరైన్‌ 


తర్వాత అంపైర్లు నరైన్‌పై ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఐసీసీ అధికారిక పరీక్ష కేంద్రమైన లాఫ్‌బ్రో(ఇంగ్లాండ్) వర్సిటీలో నవంబర్ 17న జరిగిన టెస్టులకు నారాయణ్ హాజరయ్యాడు. ఇందులో నారాయణ్ పరిమితికి మించిన కోణంలో బౌలింగ్ చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో నరైన్‌కు ఇకపై ఏ స్థాయి క్రికెట్‌లో ఆడే అవకాశం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: