టీమ్ ఇండియాల్ బ్యాట్స్ మెన్స్ ని తన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టిన మేటి ఆటగాడు అనీల్ కుంబ్లే. ఆయన గత కొంత కాలంగా ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌ చీఫ్‌ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా  ముంబై ఇండియన్స్‌ అనిల్‌ కుంబ్లే ఆ పదవికి రాజీనామా చేశారు. ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో భాగంగా 2013లో ముంబై జట్టు చీఫ్ మెంటార్‌గా కుంబ్లే బాధ్యతలు చేపట్టాడు. అతని సారథ్యంలో జట్టు రెండు సార్లు టైటిల్ గెలిచింది. అయితే వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కుంబ్లే తెలిపారు.


ఆ తర్వాత 2015 లో కూడా మరోసారి ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలుచుకోగలిగింది. బెంగళూరుకు చెందిన ఈ స్పిన్నర్‌ ఐపిఎల్‌ ఆరంభంలో అంటే...2008 నుంచి 2013 వరకు మాల్యా ప్రాంఛైజ్‌గా ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.  టెస్టులు, వన్డేల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న కుంబ్లే ఇంతకాలం తమతో ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

సచిన్ తో అనీల్ కూంబ్లే


మెంటార్ గా కుంబ్లే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐపీఎల్ ను గెలవడమే కాక, ఛాంపియన్స్ లీగ్ లో కూడా విజయదుంధుభి మోగించామని గుర్తు చేసింది. ఈ సందర్భంగా కూంబ్లే మాట్లాడుతూ..ముంబై ఇండియన్స్ తో కలసి పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని..గత మూడేళ్లలో ముంబై సాధించిన విజయాలు అద్భుతం. నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, నిఖిల్ మేశ్వానీలు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, సపోర్ట్ టీమ్ తో కలసి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: