ప్రపంచంలో క్రికెట్ క్రీడ తెలియని వారు ఉండరు. మారు మూల గ్రామాల్లో కూడా ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆటే ఆడుతున్నారంటే అతిశయోక్తి లేదు. గ్రామీణ క్రీడలు కూడా మరిచి ఇప్పుడు పిల్లలు గ్రామాల్లో క్రికెట్ పై మోజు పెంచుకున్నారు. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ అంటే మొత్తం క్రికెట్ అభిమానులు టీవిలకు అతుక్కు పోతారు. త్వరలో బంగ్లాదేశ్‌లో జరుగనున్న ప్రపంచకప్‌కు యువ భారత (అండర్‌ 19) జట్టును ఎంపిక చేశారు.

ఈ మేరకు ఇషాన్ కిషన్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. యువ భారత క్రికెట్ జట్టు జాబితాను మూడు విడతలుగా  రిలీజ్ చేశారు. ఇషాన్ కిషన్(కెప్టెన్), రిషబ్ పాంట్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ దీప్ లతో కూడిన జట్టును తొలుత విడుదల చేశారు.

ఆ తరువాత అన్మూల్ ప్రీత్ సింగ్, ఆర్మాన్ జాఫర్, రికీ భూయ్, మయాంక దాగర్, జీషన్ అన్సారీ, మహిపాల్ లామ్రోర్, అవీష్ ఖాన్ ల పేర్లను విడుదల చేసింది. అయితే చివరాకరన సుభామ్ మావి, ఖలీల్ అహ్మద్, రాహుల్ బథామ్ ల పేర్లను కూడా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఖరారు  చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: