భారత్ క్రికెట్ మహిళా, పురుష జట్లు ఈ రోజు విజృంభించాయి..  గతేడాది 2015లో బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 128 పరుగులను ఛేదించిన భారత్ తాజాగా దానిని సవరించింది.మూడు మ్యాచ్ల ట్వంటీ 20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ మహిళలు ఘనవిజయం సాధించారు.  తొలుత టాస్ గెలిచిన భారత మహిళలు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేశారు.

బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆదిలోనే కెప్టెన్ మిథాలీ రాజ్(4) వికెట్ ను కోల్పోయింది.అనంతరం మందానా(29), వేదా కృష్ణమూర్తి(35), హర్మన్ ప్రీత్ కౌర్(46)లు ఆకట్టుకోవడంతో భారత్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అందుకుంది. మరో వైపు టీమిండియా బ్యాట్స్ మెన్స్ కూడా అదరగొట్టారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య మంగళవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌‌లో భారత్ ఘన విజయం సాధించింది.

ఆస్ట్రేలియా,భారత జట్టు


ఆసీస్‌పై టీమిండియా 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవల్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వన్డేలో సాధించిన విజయం జోరును టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించింది. తొలుగ బ్యాటింగ్ కి దిగిన రోహిత్ శర్మ (31), దావన్ (5), కోహ్లీ (90), రైనా (41), దోనీ (11) రన్లు చేసి జట్లుకు విజయాన్ని అందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: