టీమిండియా కెప్టెన్ దోనీ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీలో కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేలో నాలుగు వన్డేలు పరాజయం పొంది నిరాశలో ఉన్న దోని ఐదో వన్డే గెలిచి కాస్త ఊరట చెందాడు. ఇదే కసితో ప్రస్తుతం మూడు టీ-20 ల్లో రెండింటిలో నెగ్గి భారత్ పరవు కాపాడారు. తాజాగా దోని ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్, ఫాల్కనర్లను స్టంపింగ్ రూపంలో పెవిలియన్ కు పంపిన ధోని..  అంతర్జాతీయ మ్యాచ్ ల్లో  అత్యధిక స్టంపింగ్స్(140) చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు.  

అయితే ఇప్పటికే ఈ రికార్డు శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగాక్కర ఖాతాలో ఉండేది..సంగార్కర అంతర్జాతీయ కెరీర్ లో నెలకొల్పిన 139 స్టంపింగ్స్ రికార్డు స్థాపించారు. ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ త్యధిక స్టంపింగ్స్(140) చేసి చెరిపేశారు.

ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టి-20 మ్యాచ్


యువరాజ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్రీజ్ ను వదిలి కొద్దిగా ముందుకు వెళ్లి బంతిని హిట్ చేయబోయి ధోనికి దొరికిపోగా, ఆ తరువాత ఫాల్కనర్ ను తన ప్యాడ్లతో బంతిని వికెట్లపైకి తోసి ధోని సక్సెస్ అయ్యాడు. ధోని చేసిన ఆ రెండు స్టంపింగ్స్ తో నే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోంచి  పూర్తిగా చేజారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: