భారత క్రికెట్ ఆటగాళ్లకు ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు..అంతే కాదు బాలీవుడ్ తారలకు, క్రికెట్ క్రీడాకారులకు ప్రేమ వివాహాలు కూడా కొత్త కాదు. ప్రస్తుతం టీమిండియా హాట్ లవర్స్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది..విరాట్ కోహ్లీ,అనుష్క శర్మ. గత రెండు సంవత్సరాల నుంచి వీరి ప్రేమ పీకల్లోతు మునిగిపోయిన ఈ జంట బహిరంగంగా తిరిగేందుకు ఏమాత్రం భయపడలేదు. టీమ్ ఇండియా మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ అనుష్క ప్రత్యక్షం కావాల్సిందే.. మ్యాచ్ ల మధ్య విరామ సమయాల్లో ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో అనుష్కతో కలిసి విరాట్ చక్కర్లు కొట్టాడు.

కొన్ని సందర్భాల్లో ఈ జంట మీడియాకూ చిక్కిపోయింది. వయసులో ఉన్న తాము కలిసి తిరిగితే తప్పేంటి? అంటూ అనుష్క మీడియాకే ఎదురు ప్రశ్నలు వేసింది. ఇప్పుడు వీరి మద్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గత సంవత్సరం వీరి వివాహం జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అయితే ఇప్పుడు మరో ఈ ప్రేమజంట మద్య మరో కొత్త వివాదం తలెత్తినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  

కోహ్లి, అనుష్క శర్మ


పెళ్లి చేసుకుందామన్న కోహ్లీ ప్రతిపాదనను అనుష్క తిరస్కరించిద్దన్న విషయం తెలుస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య బంధం దాదాపుగా తెగిపోయినట్టేనని తెలుస్తుంది. ఈ విషయాన్ని కోహ్లీ గాని, అనుష్క గాని ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: