టి20 ప్రపంచన్ కప్లో ఆడే ఫైనల్ ఆటగాళ్ల లిస్ట్ ను సెలెక్టర్స్ ప్రకటించడం జరిగింది. సందీప్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలో 15 మంది సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈ పోటీలో ఫాంలో ఉన్న ఆటగాళ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. మహ్మద్ షఫి, లెఫ్ట్ ఆర్మ స్పిన్నార్ పవ నేగి ఫైనల్ జట్టులో స్థానం సంపాధించగలిగారు. 


అంజిక్య రహనే మీద భారత జట్టు ఎంపిక సభ్యులు నమ్మకం ఉంచి సెలెక్ట్ చేయడం జరిగింది. రెండు సంవత్సరాలుగా కాన్ స్టంట్ ఫాం కొనసాగిస్తున్న రహానేకి జట్టులో స్థానం కల్పించడం న్యాయమైన నిర్ణయమే. ఇక షమి రాకతో భువనేశ్వర్ కు సెలెక్టర్లు నిరాశ కలిగించడం జరిగింది. ఇక ఈ మార్పులు తప్పించి ఇక మిగతా టీం మొత్తం టి20 ప్రపంచకప్ లో రంగంలో దిగనుంది.


ధోని ఆధ్వర్యంలో మెరుగైన జట్టుగా విజయ బావుటా ఎగుర వేస్తున్న భారత జట్టు ప్రప్రంచ కప్ కూడా కొడుతుందనే భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్రపంచకప్ కు ముందే ఇదే జట్టు ఆసియా కప్ లో పాల్గొననుంది. ఫిబ్రవరి 24 నుండి మార్చ్ 6 వరకు బంగ్లాదేశ్ లో.. మార్చ్ 6 నుండి ఏప్రిల్ 3 వరకు ఇండియాలో ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. 


అయితే తుది జట్టులోకి ఎంపికైన షమి ప్రస్తుతం ఫిట్ గా లేడు.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడేందుకు వెళ్లి మోకాలి గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుతిరిగిన షమి.. ప్రపంచకప్ మొదలయ్యే నాటి కల్లా పూర్తి ఫిట్ నెస్ సాధించగలడే అంటున్నారు. మరి టి20లో హాట్ ఫేవరేట్ అయినా మనదేశం ప్రపంచకప్ లో ఎలాంటి ఫలితాన్ని చూస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: