ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ రంగంలో చాలా మంది వరకు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి..అవి రుజువు కూడా అయ్యాయి. దీంతో కొంత మంది శాశ్వతంగా క్రికెట్ ఆటకు దూరం కావడం కూడా జరిగింది. ఇక టీమిండియాలో మిస్టర్ పర్ఫెక్ట్ గా కెప్టెన్సీ చేస్తూ జట్టు విజయానికి దోహద పడుతూ ఎంతో హుందాగా వ్యవహరించే దోనిపై మొట్ట మొదటి సారిగా ఫిక్స్ ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టించారు.

వివరాల్లోకి వెళితే..2014లో ఇంగ్లండ్ లో పర్యటించిన సందర్భంగా ఆ దేశ జట్టుతో మాంచెస్టర్ లో జరిగిన టెస్టు ఫిక్స్ అయ్యిందని నాటి టీమిండియా జట్టు మేనేజర్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సునీల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   ‘సన్ స్టార్’ అనే ఓ హిందీ దినపత్రిక చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అనిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన ఆ మ్యాచ్ లో ప్రస్తుత టీమిండియా వన్డే కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించాడు.

టీమిండియా కెప్టెన్ ఎంఎస్ దోనీ


వర్షం కారణంగా పిచ్ పరిస్థితి దృష్ట్యా టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకోవాలని జట్టు సమావేశంలో నిర్ణయించాం కానీ దోనీ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. ధోనీ నిర్ణయాన్ని చూసి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ కూడా షాకయ్యాడు. ఈ విషయంపై నాటి బోర్డు చీఫ్ ఎన్.శ్రీనివాసన్ కు లేఖ రాశాను. అయితే దీనిపై ఇప్పటికీ బోర్డు స్పందించలేదని దేవ్ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: