మొన్నామద్య ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్వార్ధపరుడు అంటూ బౌలర్ షేన్ వార్న్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే..సోషల్ మీడియాలో సంచలనం రేపిన ఈ విషయంలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందించారు. తనను 1999లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ నుంచి అన్యాయంగా తొలగించాడంటూ తనపై  షేన్ వార్న్ ఆరోపణలు చేస్తున్నారని వాస్తవానికి అప్పుడు అలా చేయడమే కరెక్టని వివరణ ఇచ్చారు.

అప్పట్లో జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించిన మీదటే, కెప్టెన్ గా తన పని తాను చేసుకుపోయానని, వార్న్ పై వ్యక్తిగత కోపమేమీ లేదని చెప్పాడు. ఒక దేశం నుంచి బాధ్యతాయుతంగా ఆడుతున్న సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల క్రీడాకారులకు బాధ కలుగుతుందని అంత మాత్రానా నిర్ణయం తీసుకున్న వారు స్వార్థపరులు కారని అన్నారు.


Steve Waugh, left, has defended his dropping of his former team-mate Shane Warne.

జట్టులోని ఏ ఆటగాడిని తొలగించాలన్నా అది చాలా క్లిష్టమైన అంశమేనని అన్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా, దేశ ప్రయోజనాలు, జట్టు గెలుపే ముఖ్యమని తెలిపాడు. ఆనాటి తన నిర్ణయం సరైనదేనని చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: