టి-20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న జరుగనున్న భారత్ పాక్ మ్యాచ్ ధర్మశాల నుండి కోల్ కతాకి షిఫ్ట్ చేస్తున్నట్టు ఐసిసి అధికారులు ప్రకటించారు. పాక్ తో మ్యాచ్ అంటే కావాల్సిన కట్టుదిట్టమైన భద్రత ఇవ్వలేమని తేల్చి చెప్పిన హిమాచల్ ప్రదేశ్ సిఎం మాటను అంగీకరించిన ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది. 


కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. దాయాదుల పోరులో ఎప్పటికి హాట్ ఫేవరేట్ ఇండియానే అయినా పోరు మాత్రం బాగా కొనసాగుతుంది. ఆసియా కప్ కైవసం చేసుకుని మంచి ఫాంలో ఉన్న ఇండియా జట్టు టి20 ప్రపంచకప్ కూడా కైవసం చేసుకునేందుకు సన్నద్ధం అవుతుంది. జట్టులో అందరు మంచి నైపుణ్యతను ప్రదర్శిస్తున్న ఈ సందర్భంలో ప్రపంచకప్ కూడా సుసాధ్యం కానుంది.  


ఇక ఈ నెల 19న పాక్ తో డీ కొట్టబోతున్న భారత్ అన్ని రంగాల్లో సిద్ధమవుతుంది. ప్రత్యర్ధి జట్టుని మట్టికరిపించే శక్తులన్ని కొడగట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం జట్టు ఎంపికా విధానాన్ని పూర్తి చేసుకున్న టీం ఇండియా త్వరలో మ్యాచ్ లకు సన్నద్ధ కానుంది. మన దేశంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ లో మన ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.  


హాట్ ఫేవరేట్ గా నిలిచే అన్ని జట్ల మధ్య మంచి రసవత్తరమైన పోటీ నెలకొనబడం కామనే. మరి ప్రత్యర్ధి జట్టుతో శుభారంభం పలికి జట్టుని కప్ గెలిచే రధసారధిలా నడిపిస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం అందరి కన్ను ఇండియా మీద ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆడితే కప్ అందుకోవడం అంత క్లిష్టతరమైన పనేం కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: