ఈసారి ఐపిఎల్ అత్యంత ఉత్కంఠ బరితంగా మారుతుంది. ఊహలకు అందని చేజింగ్స్ తో మిరిమిట్లు గొలిపే షాట్స్ తో క్రికెట్ అభిమానులను ఈ ఐపిఎల్ ఈజన్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక కొత్త జట్టు అయిన పూణె తమ సత్తా చాటెందుకు రంగంలో దిగినా పంజాబ్ ముందు మోకరిల్లక తప్పలేదు. పంజాబ్ జట్టు పటిష్టతం ఫలితం పూణెపై ఘన విజయం దక్కించుకుంది. 


ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పూణె ముందునుండి పేలవమైన ప్రదర్శన చూపించారు. ఓపెనర్ రహనే (9) వెంటనే పెవిలియన్ బాట పట్టగా పంజాబ్ ఆటగాళ్లకు మ్యాచ్ పై పట్టు సాదించారు. ఇక డు ప్లెసిస్, పీటర్సన్ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించినా పీటర్సన్  కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. డు ప్లెసిస్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేయగా 17వ ఓవర్‌లో స్మిత్ మెరుపు వేగంతో మూడు ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డులో కాస్త కదలిక వచ్చింది. ఆ తర్వాత ఓవర్‌లోనే అతను అవుట్‌కాగా.. చివర మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి వరుస బంతుల్లో డు ప్లెసిస్, ధోని (1)ని అవుట్ చేశాడు. ఇక 20 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 152 పరుగుల చేశారూ పూణె సూపర్ జెయింట్స్.


ఇక 153 పరుగుల లక్ష్యతో బరిలో దిగిన పంజాబ్ ముందునుండి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు విజయ్, వోహ్రా వేగంగా తీస్తూ స్కోర్ ను పెంచే ప్రయత్నం చేశారు. 5 ఓవ్గర్లకే 50 పరుగులను సాదించి గెలుగు తమ వైపుకు ఖాయమనే భావన కలిగిచినా పూణె బౌలర్స్ కాస్త ఇబ్బంద్ది పెట్టారు. వోహ్రా 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) వీర బాదుడు బాదడంతో పంజాబ్ సునాయాసంగా మ్యాచ్ ను కైవసం చేసుకుంది.


స్కోరు వివరాలు:
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (బి) సందీప్ శర్మ 9; డు ప్లెసిస్ (సి అండ్ బి) మోహిత్ 67; పీటర్సన్ (సి) వోహ్రా (బి) అబాట్ 15; పెరీరా (సి) మోహిత్ (బి) సందీప్ శర్మ 8; స్మిత్ (సి) మిల్లర్ (బి) మోహిత్ 38; ధోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 1; ఇర్ఫాన్ నాటౌట్ 1; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152.
 వికెట్ల పతనం: 1-10, 2-65, 3-76, 4-139, 5-149, 6-149, 7-152.
 బౌలింగ్: సందీప్ శర్మ 4-0-23-2; అబాట్ 4-0-38-1; అక్షర్ 3-0-26-0; సాహు 4-0-31-0; మోహిత్ శర్మ 4-0-23-3; మ్యాక్స్‌వెల్ 1-0-3-0.
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ధోని (బి) ఎం.అశ్విన్ 53; వోహ్రా ఎల్బీడబ్ల్యు (బి) అంకిత్ 51; షాన్ మార్ష్ (బి) ఎం.అశ్విన్ 4; మిల్లర్ (సి) పీటర్సన్ (బి) ఎం.అశ్వి న్ 7; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 32; సాహా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్త్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 153.
వికెట్ల పతనం: 1-97, 2-103, 3-112, 4-119.
బౌలింగ్: ఇషాంత్ 3-0-26-0; అంకిత్ 4-0-27-1; అశ్విన్ 4-0-27-0; ఎం.అశ్విన్ 4-0-36-3; ఇర్ఫాన్ 1-0-7-0; పెరీరా 2.4-0-30-0. 


మరింత సమాచారం తెలుసుకోండి: