ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబద్ ఐపిఎల్ 9వ సీజన్ లో గెలుపు తలుపు తట్టింది. రెండు వరుస మ్యాచ్ లు విఫలమవ్వడంతో గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన రైజర్స్ బౌలింగ్, బ్యాటింగ్ లో నైపుణ్యత ప్రదర్శించి జట్టుకి విజయాన్ని అందించారు. ముఖ్యంగా సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ మిరుమిట్లు గొలిపే షాట్లతో సూపర్ ఇన్నింగ్స్ ఆడి రైజర్స్ కు గౌరవ విజయాన్ని అందించాడు. 


టాస్ గెలిచిన సన్ రైజర్స్ ముంబైను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక బౌలింగ్ తో కట్టుదిట్టం చేస్తూ ముంబై వారిని కేవలం 142 పరుగుల లక్ష్యాన్నే ఇచ్చేలా చేసింది. ముంబై ఆటగాళ్లలో గప్టిల్, పార్థివ్ పటేల్, బట్లర్ తక్కువ స్కోర్స్ కే పెవిలియన్ బాట పట్టగా కీలకమైన ఇన్నింగ్స్ రాయుడు, కృణాల్ ఆడి జట్టుకు ఆమాత్రం స్కోర్ వచ్చేలా చేశారు. తొలి 10 ఓవర్లలో 58 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, తర్వాత 10 ఓవర్లలో 84 పరుగులు చేసింది.


ఇక సన్ రైజర్స్ జట్టులో ఎప్పటిలానే థావన్ సింగిల్ డిజిట్ కే అవుట్ అవగా గెలుపు భారం అంతా తన మీద వేసుకుని వార్నర్ ముంబై బౌలర్లను చీల్చి చెండాడాడు.అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ జట్టుకు అవసరమైన లక్ష్యాన్ని చేదించడంలో అవసరమైన పరుగుల దిశగా 90 పరుగులను చేశాడు. చివర్లో దిపక్ హుడా కూడా వార్నర్ కు సహకరించడంతో 17.3 ఓవర్లలోనే 145 పరుగులను సంపాదించి విక్టరీని సాదించింది రైజర్స్ జట్టు.   


స్కోరు వివరాలు :

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; పార్థివ్ (బి) శరణ్ 10; రాయుడు (సి) హెన్రిక్స్ (బి) శరణ్ 54; రోహిత్ (రనౌట్) 5; బట్లర్ (సి) నమన్ ఓజా (బి) శరణ్ 11; కృనాల్ (నాటౌట్) 49; హార్దిక్ (బి) ముస్తఫిజుర్ 2; హర్భజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-2; 2-23; 3-43; 4-60; 5-123; 6-135.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-17-1; శరణ్ 4-0-28-3; హెన్రిక్స్ 4-0-23-0; ముస్తఫిజుర్ 4-0-32-1; బిపుల్ శర్మ 4-0-40-0.


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 90; ధావన్ (బి) సౌతీ 2; హెన్రిక్స్ (సి) పార్థివ్ (బి) సౌతీ 20; మోర్గాన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 11; దీపక్ హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 145.
వికెట్ల పతనం: 1-4; 2-66; 3-100.; బౌలింగ్: సౌతీ 4-0-24-3; మెక్లీన్‌గన్ 3.3-0-33-0; జస్‌ప్రీత్ బుమ్రా 3-0-19-0; హర్భజన్ సింగ్ 4-0-38-0; హార్దిక్ పాండ్యా 3-0-29-0.


మరింత సమాచారం తెలుసుకోండి: