లీగ్ దశల్లోనే ఐపిఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా మారాయి.. గెలుపు లక్ష్యంతో బరిలో దిగుతున్న జట్లు ఎవరికి వారు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నా.. మెరుగైన ప్రదర్శన చేసిన వారికే గెలుపు తలుపు తడుతుంది. బుధవారం జరిగిన ముంబై, బెంగుళూరు మ్యాచ్ లో బెంగుళూరుపై ముంబై ఘనవిజయం సాధించింది. 


ముందు బ్యాటింగ్ చేసిన ఆర్.సి.బి (రాయల్ చాలెంజ్ బెంగుళూరు) ఓపెనర్లు కొహ్లి, రహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. రాహుల్ 23 పరుగుల వద్దే పెవిలియన్ బాట పట్టడంతో డేరింగ్ బ్యాట్స్ మన్ డివిలియర్స్ సహాయంతో జట్టుకి పరుగుల మోత మోగించారు. అయితే కొహ్లి, డివిలియర్స్ కూడా వెంటవెంటనే అవుట్ అవడంతో బెంగుళూరు కష్టాల్లో పడ్డది. ఎలాగోలా నిర్ణీత ఓవర్లలో 4 వికేట్లు కోల్పోయి 171 పరుగులను సాధించారు. 


ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఆటగాళ్లు చెలరేగిపోయారు. వరుసగా పరాజయాలతో కొద్దిగా వెనుకపడ్డ ముంబై ఇడియూన్స్ టీం సొంతగడ్డపై తొలి విజయం దక్కించుకుంది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పొలార్డ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టేయడంతో మ్యాచ్ వన్ సైడ్ అయ్యిపోయింది.

స్కోరు వివరాలు :
 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సౌతీ (బి) క్రునాల్ 33; రాహుల్ (సి) హర్భజన్ (బి) మెక్లీనగన్ 23; డివిలియర్స్ (స్టం) పార్థీవ్ (బి) క్రునాల్ 29; వాట్సన్ (సి) పార్థీవ్ (బి) బుమ్రా 5; హెడ్ రనౌట్ 37; సర్ఫరాజ్ (సి) క్రునాల్ (బి) బుమ్రా 28; బిన్నీ (సి) హార్దిక్ (బి) బుమ్రా 1; హర్షల్ నాటౌట్ 0; రిచర్డ్‌సన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 170.
వికెట్ల పతనం: 1-32; 2-91; 3-93; 4-99; 5-162; 6-169; 7-169.
బౌలింగ్: సౌతీ 4-0-25-0; మెక్లీనగన్ 4-0-46-1; బుమ్రా 4-0-31-3; హర్భజన్ 2-0-20-0; క్రునాల్ పాండ్యా 4-0-27-2; హార్దిక్ పాండ్యా 2-0-18-2.


ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డివిలియర్స్ (బి) ఇక్బాల్ అబ్దుల్లా 62; పార్థీవ్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్‌సన్ 5; రాయుడు (సి) రిచర్డ్‌సన్ (బి) అబ్దుల్లా 31; బట్లర్ (సి) వాట్సన్ (బి) అబ్దుల్లా 28; పొలార్డ్ నాటౌట్ 40; హార్దిక్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (18 ఓవర్లలో 4 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1-6; 2-82; 3-109; 4-140.
బౌలింగ్: ఆరోన్ 4-0-37-0; రిచర్డ్‌సన్ 3-0-26-1; వాట్సన్ 4-0-40-0; హర్షల్ 2-0-20-0; ఇక్బాల్ అబ్దుల్లా 4-0-40-3; బిన్నీ 1-0-8-0.


మరింత సమాచారం తెలుసుకోండి: