ఐపిఎల్ సీజన్ 9లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మెరుగైన ఆట ప్రదర్శనను కొనసాగిస్తుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్ మీద విజయాన్ని సాధించారు. ఐపిఎల్ చరిత్రలోనే మొదటి రెండు ఓవర్లు మెయిడిన్ ఓవర్స్ చేసిన ఘనత సన్ రైజర్స్ జట్టుకు దక్కింది. 


గుజరాత్ లయన్స్ ను బౌలింగ్ తో కట్టుదిట్టం చేసిన రైజర్స్ బౌలర్లు నిర్ణీత ఓవరలలో కేవలం 6 వికెట్లకు 126 పరుగులను మాత్రమే చేయలిగేలా చేశారు. స్మిత్, మెక్కల్లం సింగిల్ డిజిట్ స్కోర్స్ కే పెవిలియన్ బాట పట్టగా రైనా ముస్తఫిజుర్ లు జట్టుకు స్కోర్ అందించడంలో సహకరించారు. రైజర్స్ బౌలింగ్ దాటికి మోకరిల్లిన గుజరాత్ టీం 126 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


ఇక తక్కువ చేజింగ్ అయినా సరే రైజర్స్ టీం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఓపెందర్ థావన్ ఈ మ్యాచ్ ను తనపై వేసుకున్నాడు. వార్నర్ ఎప్పటిలానే చక చకా పరుగులు తీసి 24 వద్ద పెవిలియన్ బాట పట్టాడు. విలియమ్స్, హెన్రిక్స్, యువరాజ్, హుడా ఫ్లాప్ అవ్వడంతో మ్యాచ్ భారమంతా థావన్ మీద పడింది. ఇక ఫైనల్ గా నమన్ ఓజా సహాయంతో థావన్ (47 నాటౌట్) విక్టరీ షాట్ కొట్టాడు. మరో ఓవర్ మిగిలి ఉండగానే రైజర్స్ విక్టరీ పొందారు. 


స్కోరు వివరాలు :
గుజరాత్ లయన్స్ బ్యాటింగ్: డ్వేన్ స్మిత్ (సి) ముస్తఫిజుర్ (బి) భువనేశ్వర్ 1; మెకల్లమ్ (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 7; రైనా (సి) అండ్ (బి) భువనేశ్వర్ 20; కార్తీక్ (సి) విలియమ్సన్ (బి) ముస్తఫిజుర్ 0; ఫించ్ (నాటౌట్) 51; బ్రేవో (సి) (సబ్) విజయ్ శంకర్ (బి) బరీందర్ 18; జడేజా (సి) భువనేశ్వర్ (బి) ముస్తఫిజుర్ 18; ప్రవీణ్ కుమార్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 126.
వికెట్ల పతనం: 1-2; 2-24; 3-25; 4-34; 5-79; 6-106;
బౌలింగ్: భువనేశ్వర్ 4-1-28-2; నెహ్రా 4-1-23-0; ముస్తఫిజుర్ 4-0-17-2; బరీందర్ 3-0-21-1; హెన్రిక్స్ 3-0-24-1; యువరాజ్ 2-0-13-0.


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ప్రవీణ్ (బి) ధావల్ 24; ధావన్ (నాటౌట్) 47; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) ప్రవీణ్ 6; హెన్రిక్స్ (సి) కార్తీక్ (బి) బ్రేవో 14; యువరాజ్ (సి) సాంగ్వాన్ (బి) ధావల్ 5; హుడా (సి) కార్తీక్ (బి) బ్రేవో 18; ఓజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 129.
వికెట్ల పతనం: 1-26; 2-33; 3-55; 4-81; 5-108.  
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-28-1; సాంగ్వాన్ 2-0-28-0; ధావల్ 4-1-17-2; కౌశిక్ 4-0-25-0; జడేజా 2-0-14-0; బ్రేవో 3-0-14-2.


మరింత సమాచారం తెలుసుకోండి: