ఐపిఎల్ 9వ సీజన్లో పతి జట్టు తమ అత్యంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. రోజు మ్యాచ్ లు జరుగుతున్నా దేని కదే అన్నట్టు టఫ్ ఫైట్ చేస్తున్నాయి. ఇక నిన్న జరిగిన పంజాబ్, బెంగుళూర్ మ్యాచ్ ఈ ఐపిఎల్ లో అత్యంత టఫ్ గా జరిగిందని చెప్పాలి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగుళూరు నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది.


ఈసారి కొహ్లి నెమ్మదిగా ఆడగా కేవలం 20 పరుగులే చేయగలిగాడు. ఇక మరో ఓపెనర్ రాహుల్ 42 పరుగులు చేశాడు. అయితే విధ్వంసకర బ్యాట్స్ మన్ డివిలియర్స్ మరోసారి తన బ్యాటింగ్ పనితనాన్ని చూపించాడు. 35 బంతుల్లో 64 పరుగులు చేసిన డివిలియర్స్ 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. చివర్లో సచిన బేబి 29 బంతుల్లో 33 పరుగులు చేసి 20 ఓవర్లకు 175 పరుగులను సాధించింది.


ఇక గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు ఆమ్లా, విజయ్ మంచి దూకుడు ఆటతో మొదలు పెట్టినా ఆమ్లా 21 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక విజయ్ మరోసారి తన జట్టుని విజయ బాటలో నడిపించేందుకు 89 పరుగులను చేశాడు. అయితే ఓవర్లు దగ్గర పడుతున్నా కొద్ది తక్కువ బంతుల్లో కొట్టాల్సిన స్కోర్ పెరుగుతూ వచ్చింది. ఇక లాస్ట్ ఓవర్ 15 పరుగులు చేయాల్సి ఉండగా మ్యాచ్ మరింత ఉత్కంఠతగా సాగింది.    


చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 2 పరుగులే తీసి మ్యాచ్ బెంగుళూరుకి అప్పచేప్పేశారు పంజాబ్ ఆటగాళ్లు. ఇక కీళక దశలో బెంగుళూరు అద్భుత విజయాన్ని అందుకుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: