ఐపిఎల్ లో ప్లే ఆఫ్ కు చేరిన జట్ల ఏవో తెలిసిపోయింది. పాయింట్ల పట్టిక ఆధారంగా నాలుగు జట్లు ప్లే ఆఫ్ లో చోటు సంపాదించాయి. వరుస విజయాలతో దూసుకుపోయే కొన్ని జట్లైతే.. సరైన మ్యాచ్ లో మంచి ప్రదర్శన చూపి విజయం దక్కించుకున్న జట్లు కొన్ని. సో అలా నాలుగు జట్లు తమ అత్యున్నత ప్రదర్శనతో ప్లే ఆఫ్ లో చోట్లు సంపాదించాయి.


లీగ్ దశలో ముందు కాస్త వెనుకప మందగింపు ఆటను ప్రదర్శించిన గుజరాత్ లయన్స్ ఐపిఎల్ లోకి ఎంటర్ అయిన తొలి సీజన్లోనే అదరగొట్టేసింది. పాయింట్ల పట్టికలో 9 విజయాలను నమోదు చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఇక అదే జోరుతో బెంగుళూరు, హైదరాబాద్, కోల్ కతా జట్లు కూడా ప్లే ఆఫ్ లో చేరారు.


కొహ్లి సారథ్యంలో ప్రతి మ్యాచ్ ను ముందుండి నడిపించిన విరాట్ కొహ్లి బెంగుళూరు జట్టుని విజయ పతాకంలో ఎగురవేయడంలో అత్యుత్తమ ఆట తీరుని ప్రదర్శించి ప్లే ఆప్లోకి చేర్చాడు. ఇక హైదరబాద్ కూడా కెప్టెన్ వార్నర్ సహకారంతో మిగతా జట్ల కన్నా మెరుగైన ఆట తీరుతో ప్లే ఆఫ్ లో చేరింది.


ఇక కోల్ కతా ముందునుండి దూకుడైనా ఆటతో అభిమానులను అలరించగా.. ప్లే ఆఫ్ బర్త్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో హైదరాబాద్ ను ఓడించిన కోల్ కతా ప్లే ఆఫ్ బర్త్ సాధించింది. ఇక అసలైన పోరు ఇప్పుడే స్టార్ట్ అయ్యిందనాలి. లీగ్ దశలోనే చెమటలు పట్టించిన వీరి ఆట తీరు ఇక ప్లే ఆఫ్ లో ఎలా రంజింపచేయనుందో చూడాలి. 
ఏ జట్టు కా జట్టు తమ గెలుపు లక్ష్యంతో కప్ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతుంది. మరి ఏ జట్టు ఐపిఎల్ 9వ సీజన్ విజేతగా నిలుస్తుందో చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: