ఈ ఐపిఎల్ సీజన్లో అత్యున్నత ఆట తీరును ప్రదర్శిస్తున్న జట్లలో సన్ రైజర్స్ హైదరబాద్ కూడా ఒకటని చెప్పాలి. ప్లే ఆఫ్ బర్ కన్ఫాం చేసుకున్నా సరే చివరి రెండు మ్యాచుల్లో వైఫల్యమవడం సన్ రైజర్స్ టీంకు పరాభవం తప్పలేదు. కింగ్ ఎలెవన్ పంజాబ్ తో విజయం సాదించిన సన్ రైజర్స్.. ఆ తర్వాత డిల్లితో ఆడిన మ్యాచ్ లో ఓటమి చవి చూసింది.  


ఐపిఎల్ సీజన్లో 14 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ జట్టి ఇన్ని మ్యాచ్ లు సమిష్టి కృషితో విజయాలందుకుంది. అయితే ఇక చివరి లీగ్ మ్యాచ్ లో కూడా కోల్ కతా జట్టు మీద ఘోరంగా వైఫల్యాన్ని చవిచూసింది సన్ రైజర్స్. కోల్ కతా బ్యాటింగ్ ధాటికి సన్ రైజర్స్ బౌలర్లు విఫలమవ్వగా.. వారి బౌలింగ్ కు కూడా సన్ రైజర్స్ ఆటగాళ్లు తల వంచక తప్పలేదు.


అయితే జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్న సరె సరైన టైం కు సరైన ఆట తీరుని ప్రదర్శిస్తే తప్ప జట్టు విజయాన్ని అందుకోవడం కుదరదు. మరి ఇన్ని మ్యాచ్ లను బాగా ఆడి చివరకు వచ్చే సరికి హైదరాబాద్ జట్టు పేలవమైన ప్రదర్శన ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 


ఇక ప్లే ఆఫ్ బర్త్ ను కైవసం చేసుకున్న సన్ రైజర్స్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఫైనల్స్ కు కూడా చేరే అవకాశం ఉండదు. ఓ విధంగా సన్ రైజర్స్ జట్టు మీద ఎన్ని అంచనాలు ఉన్నా వార్నర్, థావన్ కాస్త అవుట్ అయితే ఇక ఆ జట్టు కష్టాల్లో పడ్డట్టే. ఇక్కడిదాకా మెరుగైన ప్రదర్శన కనబరచిన సన్ రైజర్స్ ఈ రెండు మ్యాచుల్లో ఎందుకు వెనక్కి తగ్గిందో కారణాలు వారికే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: