ఈ ఐపిఎల్ సీజన్లో ఎలాగైనా తమ జట్టుని విజయ పధంలో నడిపించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫిక్స్ అయ్యాడు. అందుకే ప్రతి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ తన సత్తా చాటుతున్నాడు. ప్లే ఆఫ్ లో కోల్ కతాను ఓడించి గుజరాత్ తో మ్యాచ్ కు సిద్ధమైన రైజర్స్ జట్టు మరోసారి విజయ దుంధుంభి మోగించింది.


గుజరాత్ జట్టు పెట్టిన టార్గెట్ 20 ఓవర్లలో 163 పరుగుల లక్ష్యాన్ని ఒంటి చేత్తో రీచ్ అయ్యేలా చేశాడు వార్నర్. ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు చేసింది. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్ బాట పట్టినా మెక్కల్లం ఈసారి విజృంభించి ఆడాడు.. 29 బంతుల్లో 32 పరుగులు చేసిన మెక్కల్లం జట్టుకు ఆమోద యోగ్యమైన స్కోర్ వచ్చేందుకు సహకరించాడు. ఇక దినేష్ కార్తిక్ కూడా 24 పరుగులు తీయడం జరిగింది.   


20  ఓవర్లలో 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దుమ్మిరేపే బ్యాటింగ్ నైపుణ్యంతో అజేయంగా రైజర్స్ జట్టుకు విజయాన్ని అందిచి సగౌరవంగా ఐపిఎల్ 2016 ఫైనల్స్ కు చేరుకునేలా చేశాడు.  


58 బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 93 పరుగులతో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక లీగ్ దశలో కూడా సన్ రైజర్స్ జట్టు గుజరాత్ ను రెండు మ్యాచ్ లో ఓడించింది. సో ఈ పరాజయంతో వ్రుసగా మూడు మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద రుజరాత్ ఓడిపోయింది. ఇక రైజర్స్ రాయల్ చాలెంజర్స్ మధ్య రసవత్తరమైన ఫైనల్ పోరు ఈ ఆదివారం జరుగనుంది. మరి అసలైన మ్యాచ్ విన్నర్ ఎవరో ఆరోజు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: