ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరికలేకుండా గడిపాడు. ఐపీఎల్‑లోనే రికార్డు స్థాయిలో నాలుగు సెంచరీలు చేయడంతో పాటు అత్యధికంగా 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ ముగియడంతో విరాట్‑కు విశ్రాంతి లభించింది. జింబాబ్వే టూరుకు విరాట్‑‑ను ఎంపిక చేయకుండా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక వెస్టిండీస్‑కు టూరుకు ఇంకా నెల విరామం ఉంది.


దీంతో కోహ్లీ క్రికెట్‑కు దూరంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాలకు షూటింగ్‑కు వెళ్లిన గర్ల్‑ఫ్రెండ్ అనుష్క శర్మను విమానాశ్రయనికి తీసుకెళ్లి సెండాఫ్ ఇచ్చాడు. మధ్యలో తన ఫౌండేషన్ తరపున ఈవెంట్లలో పాల్గొంటూ డాన్స్‑లతో అదరగొట్టాడు. క్రికెట్‑కు దూరంగా విరామంలో లైఫ్‑ను ఎంజాయ్ చేస్తున్నా. ఆటకు దూరంగా ఉన్నందుకు కొన్నిసార్లు రిలీఫ్‑ అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే జట్టు కూర్పు, ఇతర విషయాల గురించి అసలు ఆలోచించడం లేదు. వెస్టిండీస్ పరిస్థితులను గమనించి, అప్పుడు నలుగురు బౌలర్లతోనా లేక ఐదుమందితో బరిలోకి దిగాలా అనేది నిర్ణయిస్తాం' అని ఓ కార్యక్రమంలో విరాట్ చెప్పాడు.


ప్రీమియర్ ఫుట్సల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కోహ్లీ, ఆ సంస్థ ప్రమోషన్ కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడాడు. క్రికెట్ కు కొంత విరామమిచ్చి ఇతర వ్యాపకాల్లో ఉండటం కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుందని కోహ్లీ చెప్పాడు. త్వరలో కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు జింబాబ్వేలో, ఆపై వెస్టిండీస్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: