ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ జట్టుకు సరైన కోచ్ ను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు బిసిసిఐ ప్రతినిధులు. సరైన కోచ్ ఎవరన్నతర్జన భర్జనలో తీవ్రమైన ఒత్తిడులను ఎదుర్కుంటున్నారు. అయితే బయట కోచ్ ల కన్నా భారతీయ కోచ్ లయితేనే ఆటగాల్లతో హిందిలో కూడా మాట్లాడే అవకాశం ఉంటుందనే ప్రతిపాధనలు వస్తున్నాయి.   


అయితే ఆ వాదనలను మాత్రం టీం ఇండియా వన్డే, టి20 కెప్టెన్ ధోని తప్పు పట్టారు. కోచ్ కు భాషతో సంబంధం లేదని.. ప్రస్తుతం ఆటగాళ్లు కూడా ఇంగ్లీష్ ను అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉందని.. కోచ్ కు కూడా హింది జాతీయ భాష వస్తే బాగుంటుందని అన్నారు. ఇక కోచ్ కు భాష కంటే మన సంస్కృతి అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉండాలనారు.   


గతంలో భాతతజట్టు కోచ్ గా ఉన్న వారంతా తమ సంస్కృతిని బాగా అర్ధం చేసుకుని ఉన్నారని అన్నాడు ధోని. ఇక కెప్టెన్సీ గురించి చెబుతూ పరిమిత ఓవర్లలో ఫాం కోల్పోతున్న ఆటగాళ్లపై దృష్టి పెట్టబోతున్నామని అన్నారు. ఇక కోచ్ మీద ఫైనల్ నిర్ణయం బి.సి.సి.ఐ తీసుకుంటుందని చెప్పారు. 
ప్రస్తుతం త్వరలో జరుగనున్న జింబ్వాబ్వే పర్యటనలో మొత్తం కొత్తవాళ్లతోనే వెళ్తున్నామని.. ఎప్పుడు సీనియర్లను తీసుకెళ్లే తాను ఈసారి కొత్త వారితో వెళ్లడం మంచి అభుభవమని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: