విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ ఈ మధ్య కాలం లో ఎక్కడ చూసినా ఈ జంట పక్షుల గురించే మాట్లాడుతూ ఉన్నారు జనాలు. వారిద్దరూ విడిపోయారు అని ప్రచారం జోరుగా సాగింది. సోషల్ నెట్వర్కింగ్ లో కోహ్లీ కూడా  అప్పట్లో బాధగా విరాట్  ఫోటోలు పెట్టడం, అనుష్క ని వారిద్దరి గురించీ అడిగితే విసుక్కోవడం లాంటివి జరిగిన తరవాత వారిద్దరి ప్రేమ బంధానికీ తెర పడినట్టే అని మీడియా లాక్ వేసేసింది. అయితే అందరి ఆలోచనల్నీ నిజం కాదు అని నిరూపిస్తూ నెల రోజుల నుంచీ వీరిద్దరూ బాగా స్ట్రాంగ్ గా కలిసున్నట్టు కనిపిస్తున్నారు.

 

 విరాట్ - అనుష్క ల ప్రేమ బంధం మళ్ళీ విరిసింది అనీ వీరి రిలేషన్ కొనసాగే ఛాన్స్ లు చక్కగా కనిపిస్తున్నాయి అని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. పబ్లిక్ గా హగ్గులు - ముద్దులు మాత్రమే కాకుండా కాస్త అడ్వాన్స్ గా కూడా వీరిద్దరూ ప్రవర్తిస్తూ కనిపిస్తున్నారు. రెస్టారెంట్ లలో లేట్ నైట్ డిన్నర్ లు ఎక్కువ అయ్యాయి అనీ ఇద్దరూ ఒకరిని ఒదిలి ఒకరు ఉండలేకపోతున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న స్ట్రాంగ్ ప్రూఫ్ లు లేవు గానీ చండీఘడ్ ఎయిర్ పోర్ట్ లో పట్టపగలే చట్టాపట్టాలు వేసుకుని కనిపించారు ఇద్దరూ. ఒక అభిమాని ఫోటో తీసి ఇంటర్నెట్ లో పెట్టడం తో ఈ ఫోటో సోషల్ మీడియా లో పెద్ద సంచలనంగా మారింది.

 

అనుష్క సినిమా ఫిలోవ్రీ సినిమా సెట్స్ లో విరాట్ కనిపించాడు. మొన్నటికి మొన్న ఆమెకి ఎయిర్ పోర్ట్ లో సెండాఫ్ ఇవ్వడం కోసం వచ్చాడు మనోడు. ముంబై ఎయిర్ పోర్ట్ వరకూ వచ్చి ఆమెని ముద్దాడి మరీ పంపించాడు అంటున్నారు. మళ్ళీ ప్రేమ పక్షులు ఒకటయ్యారు అని ఫాన్స్ అందరూ సంతోషంగా ఉండగా. పబ్లిక్ గా రోమాన్స్ అనేది వీరిద్దరి మధ్యనా కాస్త ఎక్కువ అయ్యింది అని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అయితే మాటలే తప్ప ఎక్కడా ప్రూఫ్ కనపడలేదు ఇప్పటి వరకూ. ఎవరో ఒక ఔత్సాహికుడు కెమెరా క్లిక్కు మనిపించక పోతాడా చూద్దాం ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: