50 ఓవర్ల మ్యాచ్ లో సీరీస్ కైవసం చేసుకుని 20-20లో చేతులెత్తేశారు భారత ఆటగాళ్లు. శనివారం జరిగిన టి-20 మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాట్స్ మెన్ చిబాబా 20, మసకద్జా 25, సికిందర్ రజా 20, వాలర్ 30, చింగుబురా 54 సహాయంతో 20 ఓవరలో 170 పరుగుల మంచి స్కోర్ టార్గెట్ పెట్టారు.


దాదాపు ఐదుగురు కొత్త వారితో ఓ సవాల్ గా ఆడిన ఈ సీరీస్ లో వన్డేల్లో చూపించిన దూకుడు టి20లో ప్రదర్శించడంలో విఫలమయ్యారు. ఇక 120 బంతులకు 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ధోని సేన మ్యాచ్ చేజేతులా జింబాబ్వేకి ఇచ్చింది. చివరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా.. గ్రీస్ లో ధోని లాంటి హిట్టర్ ఉన్నా కూడా మ్యాచ్ విన్ అవ్వలేదు. 


వండే లో రాణించిన లోకేష్ రాహుల్ డకౌట్ అయ్యాడు. రాయుడు, మన్ దీప్ సింగ్ మధ్య భాగస్వామ్యం కుదిరినట్టు అనిపించినా రాయుడు అవుట్ కావడంతో మళ్ళీ కష్టాల్లో పడ్డది భారత్. పాండే నిలకడ బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించినా జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయాడు.  


ఇక చివర్లో 12 బంతులకు 21 కొట్టాల్సి ఉండగా అక్సర్ పటేల్ మెరుపు వేగంతో ఆడినా లాస్ట్ ఓవర్లో అవుట్ అయ్యేసరికి ఇక మ్యాచ్ చేజారినట్టే అనుకున్నారు. మ్యాచ్ చివరి బంతి దాకా గెలిచే అవకాశం ఉన్నా భారత్ బ్యాట్స్ మెన్ దాన్ని ఉపయోగించుకోలేకపోయారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: