వన్డే సీరీస్ అనంతరం జింబాబ్వేతో టి20 మూడు మ్యాచ్ ల సీరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొన్న జరిగిన మొదటి టి20లో రెండు పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ధోని సేన నిన్న జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేను బౌలింగ్, బ్యాటింగ్ రెండు ఫార్మెట్లో విజృంభించి చిత్తుగా ఓడించింది. ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే బ్టాస్ మన్ ను ముప్పతిప్పలు పెట్టించారు భారత బౌలర్లు.    


ఇక నానా కష్టాలు పడి 20 ఓవర్లలో 99 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే జట్టు. ఇక మొదటి మ్యాచ్ ఓడిన కసితో ఉన్న భారత ఆటగాళ్లు జింబాబ్వేకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కేవలం ఓపెనర్లే ఆటను ఫినిష్ చేయడం విశేషం. ఓపెనర్లు రాహుల్(47 నాటౌట్; 40 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్లు), మన్ దీప్ సింగ్(52 నాటౌట్;40 బంతుల్లో  6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది.


ఇక బౌలర్లలో శ్రవణ్ నాలుగు వికెట్లకు 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో మొత్తానికి సీరీస్ లో 1-1 తో సమానంగా ఉన్నారు భరత్ జింబాబ్వే ఆటగాళ్లు. ఇక జరుగనున్న మూడో మ్యాచ్ సీరీస్ ఎవరిది అన్నది డిసైడ్ చేస్తుంది. వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టి-20 మొదటి మ్యాచ్ లో కాస్త నిలకడ కోల్పోయి మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలున్నా సరైన ప్రణాళికను చూపలేకపోయింది. 


మరి ఈ మూడో మ్యాచ్ ఎవరికి విజయం వరిస్తుందో చూడాలి. ధోని మొదటిసారి అంతా కొత్త వారితో వెళ్లి విజయ దుంధుంభి మోగిస్తున్నాడు. మరి  ఇదే విజయ యాత్ర కొనసాగిస్తాడా లేదా అన్నది రానున్న మ్యాచుల్లో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: