భారత దేశం లో అత్యంత ప్రజాదరణ కలిగినది క్రికెట్. బాలీవుడ్ సినిమాలు అయినా సరే క్రికెట్ తరవాతనే. క్రికెట్ ని ఒక మతం గా తయారు చేసేసిన దేశం మనది. అలాంటి క్రికెట్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో దేశం తరఫున ఆడడం అంటే అంతకంటే గొప్ప న్యూస్ ఏముంటుంది? జింబాబ్వే తో రెండవ టీ ట్వెంటీ మ్యాచ్ కి యువ క్రికెటర్ మన్ దీప్ సింగ్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. యువ క్రికెటర్ లని డెబ్యూ లు చేయించడం కోసం ఈ టోర్నీ ని ఎంచుకున్న భారత్ నలుగురు ఐదుగురు తో ప్రయోగాలు చేస్తోంది.

మన్ దీప్ కూడా అందులో ఒకడు కాగా ఆ మ్యాచ్ ఆడడానికి ముందర అసలు అతనికి నిద్ర కూడా పట్టలేదు అని చెబుతున్నాడు. మొదటి మ్యాచ్ దారుణంగా చిన్న టీం చేతిలో ఓడిపోయాం అనే బాధ ఒక పక్కా తెల్లారితే ఆడాల్సిన మ్యాచ్ ఒక పక్కా ఉండడం తో మన్ దీప్ రాత్రంతా నిద్ర లేకుండా అదే ఆలోచిస్తూ ఉన్నాడట. ఈ మ్యాచ్ గెలిస్తేనే సీరీస్ నిలబడుతుంది కూడా, ఇది గనక కోల్పోతే జింబాబ్వే చేతిలో సీరీస్ ని కోల్పోయి భారీ పతనం చవిచూడాలి ఈ ఆలోచనల నడుమన ఉండిపోయాడు మనోడు.

అయితే రెండవ టీ ట్వెంటీ లో సూపర్ హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ని గెలిపించాడు మన్ దీప్. రెండవ మ్యాచ్ కూడా దాదాపు పోతుంది అని అనుకున్న సందర్భం లో సీరీస్ ని నిలబెట్టాడు. సెలెక్టర్ లు ఈ సీరీస్ ని ఆసక్తిగా చూస్తున్నారు, ఏ యంగ్ టాలెంట్ తమని తాము నిరూపించుకుంటున్నారు అనేది చూసి వారిని మరిన్ని మ్యాచ్ లకి పోడిగించాలి అనేది వారి లెక్క సో ఈ మ్యాచ్ మనోడికి బాగా కలిసొచ్చింది. అయితే అప్పటి వరకూ ఉన్న ఉత్కంట అతనికి బ్యాటింగ్ కి దిగిన తరవాత దూరం అయ్యింది అట , లక్ష్యం కేవలం 100 మాత్రమే అవడం తో మనసు తేలికపడి తేలికగా సాదించా అంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: