ఈ మధ్య కాలం లో ఎవరి గురించి వారు ఆటో బయాగ్రఫీ లు అదేనండీ ఆత్మకథలు రాసుకోవడం బాగా అలవాటు అయిపొయింది. అప్పట్లో అంటే ఏజ్ పైపడిన ముసలోళ్ళు మాత్రమే జీవితం లో తాము ఎదో సాధించేసాం అని చెప్పుకోడానికి ఇదంతా రాసేవారు కానీ ప్రస్తుతం ఆత్మకథల పేరిట కుర్ర సెలేబ్రిటిలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖుల ఆత్మకథలు అనగానే జనాలు కూడా చాలా ఆసక్తిగా ఈ పుస్తకాల కోసం ఎదురు చూడక తప్పదు కదా.

ఎప్పుడెప్పుడు కొత్త పుస్తకం మార్కెట్ లోకి వస్తుందా అని ఎదురు చూసే పుస్తక ప్రియుల సంగతి అయితే చెప్పనక్కర లేదు. ప్రస్తుతం టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మిర్జా తన జీవితం గురించి నలుగురి దగ్గరా చెప్పుకోవాలనే ఉద్దేశ్యం తో 29 సంవత్సరాల వయసుకే తన జీవిత కథ ని పుస్తకంగా మార్చి ప్రింట్ చేయించింది. అయితే కథలో ట్విస్ట్ ఏంటంటే తన పుస్తకం లో పెళ్లి తో పాటు చాలా విషయాల గురించి రాసాను అని చెబుతోంది. కోట్లాది భారతీయిలు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తాను ప్రయత్నం చేసాను అని ఆమె చెబుతోంది.

 " యాన్ ఎగిన్స్ట్ ఆడ్స్ " అనే పేరు గల ఈ పుస్తకం స్వయంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ విడుదల చెయ్యడం తో ఈ పుస్తకానికి భారీ క్రేజ్ ఏర్పడింది. అసలే సూపర్ టెన్నీస్ ప్లేయర్ సానియా మిర్జా అందులోనూ బాలీవుడ్ కింగ్ షారూక్ చేతుల మీదుగా పుస్తకం విడుదల చెయ్యడం అంటే మాటలా ? ఈ దెబ్బతో సానియా పుస్తకానికి విపరీతమైన మోజు వచ్చేసింది జనాల్లో. పెళ్లి గురించి ఆమె పుస్తక ఆవిష్కరణ తరవాత ఒత్తి ఒత్తి చెప్పారు మీడియా తో " ఈ పుస్తకం లో నా పెళ్లి గురించి సవివరంగా రాసాను, ఎక్కడా ఏ విషయం దాయలేదు " అంటూ చెప్పుకొచ్చారు ఆమె.

 జీవిత కథ అన్న తరవాత పెళ్లి ఎంతో ముఖ్యమైన భాగం కాబట్టి ఆ విషయం చెప్పి, ప్రస్తావించి, వివరించి తీరాలి ఎందుకు ఆ విషయాన్ని అంత హై లైట్ చేస్తూ చెబుతున్నారు అనేది అర్ధం కావడం లేదు. ఒక పాకిస్తానీ ని పెళ్లి చేసుకునే విషయం లో సానియా మిర్జా పెళ్లి టైం లో చాలా గందరగోళం ఏర్పడింది. ఆమె పాకిస్తాన్ వ్యక్తి షోయబ్ మాలిక్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. దాంతో ఈ దేశం లో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. నిజానికి ఆమె చేసిన , అందుకున్న ట్రోఫీ ల కంటే కూడా జనాలకి ఆమె ఈ రకంగానే బాగా గుర్తుంది. ఆమె పెళ్లి ఈ దేశం లో చాలా పెద్ద సంచెలనం సో మరొక సారి ఆ కాంట్రవర్సీ ని  బాగా వాడుకుని తన పుస్తకం అమ్మేద్దాం అని ఆమె ప్లాన్ వేస్తున్నట్టు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: