వెస్టిండీస్ సీరీస్ లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో గ్రేట్ విక్టరీ అందుకుంది.ఇక ఈ గెలుపుతో 1-0తో ఆధిక్యంలో ఉంది భారత జట్టు. ఉమేష్‌ (4 వికెట్లు), షమి (4 వికెట్లు), మిశ్రా (2 వికెట్లు) తో విండీస్ ఆటగాళ్లను కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే ఆలౌట్ అయిన వెస్టిండీస్‌.భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకి 323 పరుగులు వెనకబడింది. 


ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విండీస్‌ను ఫాలోఆన్‌ ఆడించగా. రెండో ఇన్నింగ్స్‌లో నూ అశ్విన్‌ మాయాజాలంతో (7 వికెట్లు) కోల్పోవడం విశేషం ఇక ఇన్నింగ్స్ మొత్తం మీద 231 పరుగులకే చేతులెత్తేసిన విండీస్ జట్టు ఘోరంగా ఓటమి చవిచూసింది. విరాట్ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 566/8 వద్ద డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మొత్తం 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్‌. 


వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 90.2 ఓవర్లలో 243 ఆలౌట్‌. 


వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌):  క్రెయిగ్‌ బ్రాతవైట్‌ (ఎల్బీ) ఇషాంత 2, చంద్రిక (సి) సాహా (బి) అశ్విన్‌ 31, బ్రావో (సి) రహానె (బి) ఉమేష్‌ 10, శామ్యూల్స్‌ (బి) అశ్విన్‌ 50, బ్లాక్‌వుడ్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 0, ఛేజ్‌ (సి) సబ్‌ (రాహుల్‌) (బి) అశ్విన్‌ 8, డౌరిచ్‌ (ఎల్బీ) మిశ్రా 9, హోల్డర్‌ (బి) అశ్విన్‌ 16, కార్లోస్‌ బ్రాతవైట్‌ 51 నాటౌట్‌, బిషూ 32(సి) పుజారా (బి) అశ్విన్‌ 45, గాబ్రియెల్‌ (బి) అశ్విన్‌ 4


ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 231; వికెట్లపతనం: 1-2, 2-21, 3-88, 4-92, 5-101, 6-106, 7-120, 8-132, 9-227; బౌలింగ్‌: ఇషాంత్ 11-2-27-1, షమి 10-3-26-0, ఉమేష్‌ 13-4-34-1, అశ్విన్‌ 25-8-83-7, మిశ్రా 19-3-61-1.



మరింత సమాచారం తెలుసుకోండి: