ఒలంపిక్స్ లో రజత పతాకంతో సాధించి దేశ గౌరవాన్ని చాటి చెప్పిన పివి సింధు ఈరోజు గన్నవరం చేరుకోగా అక్కడి నుండి విజయోత్సవ ర్యాలి నిర్వహిస్తున్నారు. ఓపెన్ టాప్ బస్ ప్రత్యేకంగా ఈ ర్యాలి కోసం ఏర్పాటు చేశారు. ఏపి ప్రభుత్వం తపపున మంత్రి అచ్చెన్నాయుడు, వంశీ ఈ ర్యాలిలో పాల్గొన్నారు.


రియో ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో స్పెయిన్ క్రీడాకారిణితో ఫైనల్స్ లో ఓడిన సింధు మొదటి నుండి దూకుడు ఆటతో రజత పతకాన్ని దక్కించుకుంది. గోపిచంద్ కోచ్ గా సింధు ఈ అరుదైన విజయాన్ని అందుకుంది. ఇక నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈ విజయోత్సవ ర్యాలి ఈరోజు ఏపిలో జరుగుతుంది.  


గన్నవరం నుండి విజయవాడ వరకు ఈ విజయోత్సవ ర్యాలి జరుగనుంది. రజత పతాకంతో పాటు దేశ ప్రజల ప్రేమను కూడా దక్కించుకున్న సింధు తనకు ఇంతటి గౌరవం దక్కడంతో ఆనందంలో మునిగితేలుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: