జాతీయ క్రీడాకారుల సందడి మ‌రోసారి హైద‌రాబాద్ సంద‌డి చేసింది. ప్ర‌పంచ స్థాయిలో భార‌దేశ పేరు ప్ర‌ఖ్యాత‌లకు ఓ స్థానాన్ని ఉంచిన దేశ క్రీడాకారులు మ‌రోసారి క‌లిసి త‌మ త‌మ అనందాన్ని పంచుకున్నారు. దీనికి హైద‌రాబాద్ పుల్లెల గోపిచంద్ అకాడమీ వేదిక గా నిలిచింది. గ‌త రియో- 2016 ప్రారంభ ద‌శ‌లోనే భార‌త బ్యాడ్మింట‌న్ చెందిన ఓ నేత క్రికెట్ దేవుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు స‌చిన్ టెండూల్క‌ర్ చేతుల మీదుగా బీఎండబ్య్లూ కారును బ‌హుకరిస్తాన‌ని తెలిపిన సంగ‌తి విదిత‌మే. ఈ క్ర‌మంలో నేడు స‌చిన్ రియో ఒలింపిక్స్ లో సిల్వ‌ర్ ప‌థ‌కాన్ని గెలుపొందిన పీవీ సింధు, సాక్షి మాలిక్ వారికి కొచ్ గా ఉండి వారికి ఆ స్థాయిలో కి న‌డింపించిన బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గొపిచంద్, జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ ల‌కు బీఎండబ్య్లూ కార్ల‌ను బ‌హుక‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న సెల్ పోన్ తో వారితో సెల్పీ తీసుకున్నారు.

బీఎండబ్య్లూ కార్ల‌ను అంద‌జేసిన స‌చిన్....

రియో ఒలింపిక్స్ లో అత్యుత్త‌మ  ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో ష‌ట్ల‌ర్ పీవీ సింధు, రెజ్ల‌ర్ సాక్షి మాలిక్, జిమ్నాస్టు దీపా క‌ర్మాక‌ర్.. ఒక్క‌సారిగా స్టార్లు గా మారిపోయారు. ఇప్ప‌టికే వారికి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌జ‌రానాలు ప్ర‌క‌టించ‌గా... తాజాగా వారికి ఖ‌రీదైన బీఎండ‌బ్య్లూ కార్లు కూడా అందాయి. ఈ రోజు స‌చిన్ నలుగురికి నాలుగు బీఎండ‌బ్య్లూ కార్ల‌ను అందజేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు తేజం పీవీ సింధు అచ్చం ఫ్యాష‌న్ ఐకాన్ లా తెలుపు రంగు డ్రెస్సు లో మెరిసిపోగా... సాక్షిమాలిక్ న‌ల్ల‌టి కోటుతో అచ్చ‌మైన క్రీడాకార‌ణిగా క‌నిపించింది. ఇక జిమ్నాస్టిక్స్ లో భార‌త్ స‌త్తా చాటిన దీపా కర్మాక‌ర్ మాత్రం జీన్స్ ప్యాంట్, రెడ్ క‌ల‌ర్ టీ షర్ట్ తో వ‌స్తాదుకు వ‌ల్లే రెజ్ల‌ర్ లుక్ లో క‌నిపించింది. ఇక పుల్లెల గోఫిచంద్ మాత్రం ఎప్ప‌టిలాగే తాను సింఫుల్ గానే క‌నిపించారు. 

రియో క్రీడాకారుల‌నుద్దేశించి మాట్లాడిన స‌చిన్....
 
అయితే వీరికి కార్ల‌ను బ‌హుక‌రించిన అనంత‌రం స‌చిన్ మాట్లాడారు. సింధు, సాక్షి, దీపా దేశ ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టార‌న్నారు. క్రీడ‌ల్లో దేశ విజ‌య ప్ర‌స్థానం ఇప్పుడే ప్రారంభ‌మైంద‌ని తెలిపిన స‌చిన్... క్రీడాకారులంద‌రికీ మ‌ద్ద‌తుగా ఉంటాన్నారు. ఇలాంటి వేడుక‌లు మ‌రెన్నో చేసుకోవాల‌న్నారు. అంత‌టితో ఆగ‌కుండా గోపిచంద్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు స‌చిన్. మీరు మ‌హ‌త్త‌ర స్పూర్తి, గోపీ విజ‌యాలు చూసి గ‌ర్విస్తున్నాం గోపీ నువ్వు రియ‌ల్ హీరో. మీరు దేశానికి మ‌రిన్ని ప‌త‌కాలు అందించాల‌న్నారు. గోపీతో పాటు మిగ‌తా కోచ్ లంద‌రికీ ధ‌న్య‌వాదాలు  చెప్పారు సచిన్. అనంతరం ప‌త‌కం సాధించిన సింధు సైతం త‌న అభిప్రాయాన్ని స‌చిన్ తో పంచుకుంది

స్వ‌ర్ణం దీమాతో ఉన్నామ‌న్న సింధు, సాక్షిలు...

భ‌విష్య‌త్ లో జ‌రిగే బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్ల లో గెలిచి భార‌త్ కు మ‌రింత పేరు తెస్తాన‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా ఈ వేదిక‌పై  ఉండ‌టం ఎంతో గౌర‌వంగా ఉంద‌న్నారు సింధు. కారు బ‌హుక‌రించిన స‌చిన్. చాముండీ కి సింధు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక మ‌రో వైపు మ‌రో విజేత సాక్షిమాలిక్ స్పందిస్తూ... దేశ ప్ర‌జ‌లు త‌న‌పై కురిపిస్తున్న ప్రేమ‌ను చూస్తుంటే సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు. తాను ఒలింపిక్స్ ఒంటరిగా వెళ్లాల‌ని తెలిపారు. దేశ ప్ర‌జ‌లంతా త‌నకు మ‌ద్ద‌తిచ్చినందుకు వారి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక చివ‌రిగా  వీరిద్ద‌రు రానున్న టోక్యో ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం సాధిస్తామ‌ని తెలిపారు. మ‌రి వీరి క‌ష్టానికి మ‌రోసారి ప్ర‌తిఫ‌లం అంద‌నుందా లేదా చూడాలి...! 


మరింత సమాచారం తెలుసుకోండి: