రియో ఒలంపిక్స్ లో రజిత పతాకాన్ని తెచ్చిపెట్టిన పివి సింధు ఆ పతకంతో ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టుకుంది. ఒలంపిక్స్ లో అద్భుతమైన షెట్లర్ గా సింధు తొలి రికార్డ్ సృష్టించగా ఇప్పుడు ఆమె ఎకౌంట్ లో మరో అత్యున్నత రికార్డ్ వచ్చి చేరింది. రియో ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి మారిన్ తో పోరాడి ఓడిన సింధు రజితంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఫైనల్ ఆటను దేశ వ్యాప్తంగా 6.6 కోట్ల మంది వీక్షించడం జరిగిందట. 


మన దేశంలో ఇంతమంది చూసిన షో ఇదొక్కటే. ఇప్పటిదాకా ది కపిల్ శర్మ షోనే 5 కోట్ల వ్యూయర్ షిప్ తో ముందంజలో ఉంది. అయితే సింధు ఆ షోని క్రాస్ చేసేసింది. ఫైనల్స్ జరిగిన మొదటి 15 నిమిషాలు 1.64 కోట్ల మంది చూడగా ఆ తర్వాత మరో 3.8 కోట్ల మంది చూడటం మొదలు పెట్టారట. 


ఇక ఏరియాల వారిగా చూస్తే ముంబైలో 35 లక్షలు, హైదరాబద్ 31 లక్షలు, బెంగుళూరు 29 లక్షలు, దిల్లీ 24 లక్షలు, చెన్నై 23 లక్షల మంది మ్యాచ్ చూడటం జరిగిందట. ముంబై తర్వాత హైదరాబాద్ లోనే ఎక్కువ మంది మ్యాచ్ వీక్షించడం విశేషం.    



మరింత సమాచారం తెలుసుకోండి: