రియో పారలింపిక్స్ లో దీపా మాలిక్ రజత పతకాన్ని సాధించింది. మహిళల షాట్ పుట్ ఎఫ్ 53 విభాగంలో దీపా రజత పతకాన్ని దక్కించుకుంది. ఇప్పటికే భారత అథ్లెట్లు ఒక బంగారు పతకం, ఒక కాస్య పతకం గెలుచుకోగా ఈరోజు దీపా మాలిక్ షాట్ పుట్ లో రజత పతకం గెలుచుకుంది.

 

ఇక ఈ విభాగంలో పారాలింపిక్స్ లో రజత పతకం గెలుచుకున్న తొలి మహిళగా దీపా అరుదైన రికార్డును సృష్టించింది. షాట్ పుట్ లో ఎఫ్-53లో 4.61 మీటర్ల దూరంలో షాట్ పుట్ చేయగా దీపా రజత పతకం గెలుచుకుంది. హర్యానాకు చెందిన 45 ఏళ్ల దీపా ఈ పతకంతో అందరికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. ఇక తను పతకం గెలవడంతో హర్యానా క్రీడా పథకం క్రింద ఆమెకు 4 కోట్ల నజరానా ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: