భారత స్పిన్నర్ బౌలర్ అశ్విన్ అరుదైన ఘనత సాధించడం జరిగింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులను మట్టి కరిపించే అశ్విన్ టెస్ట్ లో అతి తక్కువ మ్యాచ్ లతో 200 వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే అశ్విన్ కు ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ క్లారి గ్రిమెట్ 36 టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టగా.. ఆ రికార్డ్ ను అందుకునే క్రమంలో మరో మ్యాచ్ అదనంగా ఆడి 37 మ్యాచ్ లకు అశ్విన్ ఈ రికార్డ్ సృష్టించడం జరిగింది.


80 ఏళ్లలో ఇలా అత్యంత వేగంగా వికెట్లను తీసిన ఘనత అశ్విన్ దే అని చెప్పాలి. అసలైతే వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తోనే ఈ రికార్డ్ సృష్టించాల్సి ఉంది కాని అక్కడ రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా ఆగిపోయాయి. అందుకే తొలిటెస్ట్ లోనే న్యూజిల్యాండ్ బ్యాట్స్ మన్ ను తన స్పిన్ మంత్రంతో అవుట్ చేసి తన రికార్డును సృష్టించుకున్నాడు అశ్విన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: