లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి ఎదురుగా ఉండగా, అతడిని మించి ఆడటం మరో బ్యాట్స్‌మన్‌కు సాధ్యమా? కోహ్లి తర్వాత వచ్చి అతనికంటే వేగంగా పరుగులు చేసి అతడిని దాటేయడం మరొకరి వల్ల జరిగే పనేనా? కానీ కేదార్‌ జాదవ్‌ దీనిని చేసి చూపించాడు. తనకు అందివచ్చిన అతి స్వల్ప అవకాశాల్లోనే తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న జాదవ్, ఇప్పుడు కెరీర్‌ను మలుపు తిప్పే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది అంటే కారణం కోహ్లి—జాదవ్‌ల భాగస్వామ్యమే. అంత అద్భుతంగా ఆడింది ఈ జంట.



లేదంటే 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ పోరాటం చాలా ముందే ముగిసేదే. భారీ ఛేదనలో విలే ఆరంభంలోనే భారత్‌ను దెబ్బతీశాడు. 24 పరుగులకే ఓపెనర్లు ధావన్‌ (1), రాహుల్‌ (8)లను ఔట్‌ చేశాడు. వికెట్ల పతనం ఆగింది కొద్దిసేపే. ఓ వైపు కోహ్లి ఉన్నా.. భారత్‌ మరో రెండు వికెట్లు చేజార్చుకుని చిక్కుల్లో పడింది. స్టోక్స్‌.. వరుస ఓవర్లలో యువరాజ్‌ (15), ధోని (6)లను ఔట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ తిరుగులేని ఆధిక్యంలో ఉన్న సందర్భమది. మరో 288 పరుగులు చేయాల్సివుండగా.. 4 కీలక వికెట్లు చేజార్చుకున్న భారత్‌ గెలుస్తుందని ఎవరూ భావించి ఉండరు. కానీ అద్భుతమే జరిగింది.


కలిసి కొట్టారు

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జాసన్‌ రాయ్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) జడేజా 73, అలెక్స్‌ హేల్స్‌ (రనౌట్‌) 9, జో రూట్‌ (సి) పాండ్యా (బి) బుమ్రా 78, మోర్గాన్‌ (సి) ధోనీ (బి) పాండ్యా 28, జోస్‌ బట్లర్‌ (సి) ధవన్‌ (బి) పాండ్యా 31, స్టోక్స్‌ (సి) ఉమేష్‌ (బి) బుమ్రా 62, మొయిన్‌ అలీ (బి) ఉమేష్‌ 28, వోక్స్‌ (నాటౌట్‌) 9, డేవిడ్‌ విల్లీ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 50 ఓవర్లలో 350/7; వికెట్లపతనం: 1-39, 2-108, 3-157, 4-220, 5-244, 6-317, 7-336; బౌలింగ్‌: ఉమేష్‌ 7-0-63-1, హార్దిక్‌ పాండ్యా 9-0-46-2, బుమ్రా 10-0-79-2, జడేజా 10-0-50-1, అశ్విన్‌ 8-0-63-0, కేదార్‌ జాదవ్‌ 4-0-23-0, యువరాజ్‌ 2-0-14-0.



భారత్ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) విల్లీ 8, శిఖర్‌ ధవన్‌ (సి) అలీ (బి) విల్లీ 1, కోహ్లీ (సి) విల్లీ (బి) స్టోక్స్‌ 122, యువరాజ్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 15, ధోనీ (సి) విల్లీ (బి) బాల్‌ 6, కేదార్‌ జాదవ్‌ (సి) స్టోక్స్‌ (బి) బాల్‌ 120, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 40, జడేజా (సి) రషీద్‌ (బి) బాల్‌ 13, అశ్విన్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 48.1 ఓవర్లలో 356/7; వికెట్లపతనం: 1-13, 2-24, 3-56, 4-63, 5-263, 6-291, 7-318; బౌలింగ్‌: క్రిస్‌ వోక్స్‌ 8-0-44-0, డేవిడ్‌ విల్లీ 6-0-47-2, జాక్‌ బాల్‌ 10-0-67-3, స్టోక్స్‌ 10-0-73-2, రషీద్‌ 5-0-50-0, మొయిన్‌ అలీ 6.1-0-48-0, రూట్‌ 3-0-22-0.


మరింత సమాచారం తెలుసుకోండి: