కటక్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 150 చితక్కొట్టిన యువరాజ్ సింగ్ కు ప్రశంసలు అభినందనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కటక్‌ వన్డేలో శతకంన్నర కొట్టిన యువరాజ్ సింగ్ గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ‘అతను క్యాన్సర్‌ను ఓడించాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లను మాత్రమే ఓడించాడు. నిరాశ చెందకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల’ని వీరూ అన్నాడు. 



మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన 35 ఏళ్ల యువీ అసాధారణ ఆటతో 150, కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోని 134 పరుగులతో రాణించారు. దీంతో మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు, వ్యాఖ్యాతలు సైతం వీరిద్దరినీ ఆకాశానికెత్తేస్తున్నారు.  2011 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న యువరాజ్.. అదే ఏడాది క్యాన్సర్ బారినపడ్డాడు. ఆ వ్యాధితో పోరాడి జయించి.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. 35 ఏళ్ల యువీకి పలు అవకాశాలు వచ్చినా రాణించలేకపోయాడు.



పాత నోట్లు మాత్రమే చలామణిలో లేవు. యువరాజ్‌, ధోనిల ఆట మాత్రం అందుబాటులోనే ఉందని’ తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘ఈ వ్యక్తి క్యాన్సర్‌ను జయించాడు. అతడు మాత్రమే ఈ రోజు ఇంగ్లీష్‌ బౌలర్లను ఓడించాడు. సాధించేదాకా పట్టు వదలని తత్వాన్ని అతడి (యువీ) దగ్గర నుంచి నేర్చుకోవాలని’ యువరాజ్‌సింగ్‌ను ఉద్దేశించి సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: