భారత క్రికెట్ చరిత్రలోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కూడా సచిన్ టెండుల్కర్ కు ప్రత్యేక స్థానం ఉంది ఉంటుంది. ఎప్పుడు సరదాగా చలాకీగా ఉండే సచిన్ స్లెడ్జింగ్ చేశాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు ఆస్ట్రేలియా ఒకప్పటి స్టార్ బౌలర్ మెక్ గ్రాత్.. 1990-2000 దశకంలో ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ ఒక ఆయుధంగా మార్చుకుంది. అయితే అప్పట్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవా స్లెడ్జింగ్ చేయడాన్ని గేంస్ మెన్షిప్ అంటూ ఓ పేరు కూడా పెట్టాడని మెక్ గ్రాత్ అన్నాడు. 


ఫీల్డ్ లో ప్రతి ఒక్కరు స్లెడ్జింగ్ చేస్తారని కాని అందరు ఆస్ట్రేలియా చేసినప్పుడే పాయింట్ అవుట్ చేస్తారని అన్నాడు. ఆ క్రమంలోనే సచిన్ కూడా స్లెడ్జింగ్ చేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఆ సందర్భం ఏంటో ఏ మ్యాచ్ లో సచిన్ స్లెడ్జింగ్ చేశాడో మాత్రం చెప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: